Breaking News

మాకూ కావాలి ‘జస్టిస్‌’

Published on Fri, 06/05/2026 - 06:01

సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర పని భారం వల్ల సత్వర న్యాయం అందించలేని స్థితిలో న్యాయస్థానాలు విధులు నిర్వహిస్తున్నాయి. జనాభాకు సరిపడా జడ్జీలు లేక కేసుల ఒత్తిడితో వారు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోర్టు విచారణ సమయం తర్వాత కూడా తీర్పులు డిక్టేషన్‌ చేయడం, మరలా వాటిలో తప్పొప్పులను పరిశీలించి సరిచేయడం.. ఇలా పనిభారంతో సతమతం కావాల్సి వస్తోంది. సెలవు రోజుల్లో విచారణ కొనసాగించకున్నా.. ఇతర పనులు తప్పడం లేదు. వాదనల నమోదు, గత తీర్పుల విశ్లేషణ.. అనంతరం తాజా కేసుల్లో తీర్పు రాయడం.. ఇలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

మరోవైపు ప్రజలు తమ కేసుల విచారణ పూర్తికాక ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొత్తగా పోస్టుల సంఖ్య పెంపు మాటేమోగానీ.. మంజూరైన వాటిని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడం.. నిరంతరం 20 నుంచి 30 శాతం ఖాళీలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 34 నుంచి 38కి పెంచిన నేపథ్యంలో హైకోర్టులోనూ జడ్జీల సంఖ్య కూడా పెంచాలన్న డిమాండ్‌ తెరపైకి వస్తోంది. అదీగాక ఇరురాష్ట్రాల ఎన్‌సీఎల్‌టీ, క్యాట్‌ ఇక్కడే ఉండటంతో బెంచ్‌లు సరిపోవడం లేదనే అభిప్రాయం కూడా ఉంది.  

సరిపడా జడ్జీలు లేకుంటే సమస్యలివీ.. 
⇒ కోర్టుల్లో పేరుకుపోయే కేసుల భారం 
⇒ న్యాయవ్యవస్థపై పెరుగుతున్న పని ఒత్తిడి 
⇒ సామాన్యుడికి ‘న్యాయం’అందేందుకు ఏళ్లకు ఏళ్లు 
⇒ కోర్టుల్లో సత్వర న్యాయం దక్కేందుకు అవకాశం లేకపోవడం

తెలంగాణలోనూ జడ్జీల సంఖ్య పెంచాలి 
జడ్జీల సంఖ్య జనాభాకు సరిపడా లేకపోవడంతో కేసుల పెండింగ్‌ రేటు అంతకంతకు పెరిగిపోతోంది. హైకోర్టులో విభజన సమయంలో మంజూరైన పోస్టులే తప్ప.. ఇప్పటివరకు పెంచలేదు. అందులోనూ ఖాళీలతో కక్షిదారులు, న్యాయవాదులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. హైకోర్టుతోపాటు ఇతర కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచి.. సత్వర న్యాయానికి ప్రభుత్వాలు దోహదం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు ఆ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలి. –హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్‌.సురేందర్‌రెడ్డి

దేశంలో పెండింగ్‌ కేసులు 5 కోట్లకుపైగా ఉన్నాయి. ఇందులో దశాబ్దాల కేసులు కూడా ఉండటం ఆశ్చర్యకరం. నేషనల్‌ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌ (ఎన్‌జేడీజీ) ఈ ఆలస్యానికి కారణాలను అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఏడు ప్రధాన కారణాలు ఇలా.. 
న్యాయవాది అందుబాటులో లేక..: 59,72,394 
నిందితుడు పరారీలో: 34,17,009 
సాక్ష్యం కారణంగా: 25,79,442 
స్టే కారణంతో: 20,62,339 
డాక్యుమెంట్ల కోసం: 13,74,611 
కక్షిదారుల నిరాసక్తత: 7,35,127 
పదేపదే అప్పీళ్లు: 4,29,373 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)