Breaking News

అక్రమ కేసులతో మీడియాను అణచివేయడం అసాధ్యం

Published on Thu, 09/18/2025 - 04:29

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ కేసులతో మీడియాను అణచివేయడం అసాధ్యం అని కుల సంఘాలు స్పష్టం చేశాయి. సాక్షి పత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఈ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. 

ప్రజాస్వామ్యంలో ఫోర్త్‌ ఎస్టేట్‌గా వ్యవహరించే మీడియా.. ప్రజల సమస్యలతో పాటు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతుందని, అలాంటి వాటిని సానుకూలంగా స్వీకరించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించాయి. సాక్షి మీడియా వచ్చిన తర్వాత బీసీలు, బడుగు, బలహీన వర్గాల గొంతు పెద్ద ఎత్తున వినిపిస్తోందని ఆ సంఘాలు తెలిపాయి.  

అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి.. 
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే ఈ వ్యవస్థను బలవంతంగా కేసులు పెట్టి లొంగదీసుకోవాలనుకోవడం ముర్ఖత్వం. సాక్షి మీడియా ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే ఏపీ ప్రభుత్వం ఈ కేసులను ఉపసంహరించుకోవాలి.          
– జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు 

పత్రికా స్వేచ్ఛను హరించడమే.. 
ప్రతిపక్షంతో పాటు విపక్ష అనుకూల మీడియా గొంతు నొక్కుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాల చర్యలను ఎండగట్టడంలో మీ డియా పాత్ర కీలకం. అలాంటి వార్తలను ప్రభుత్వం పాజిటివ్‌గా తీసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలి. అలాకాకుండా మీడియాపైన అక్రమంగా కేసులు పెట్టడమంటే ప్రతికా స్వేచ్ఛను హరించడమే. సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.   
– గవ్వల భరత్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం 

మీడియాపై దాడి మంచిదికాదు 
ప్రభుత్వాలు ఏ మీడియాపైనా ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయవద్దు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే.. వాటికి వివరణ ఇవ్వడమో, ఖండించడమో జరగాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తామనడం సరికాదు. సాక్షి ఎడిటర్‌పై ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. 

మీడియాలో కేవలం పాలకపక్షం వార్తలే కాకుండా ప్రతిపక్షం వార్తలు కూడా వస్తాయి. ప్రతిపక్షాల వార్తలు రాసినందుకు సాక్షి మీడియాపై కేసులు నమోదు చేయడమంటే జర్నలిజంపై నేరుగా దాడి చేయడమే.   
– జి.చెన్నయ్య, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు   

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)