Breaking News

కుక్కకు భయపడి.. మూడో అంతస్తు పైనుంచి దూకి..

Published on Sun, 05/21/2023 - 18:27

సాక్షి, హైదరాబాద్‌: డెలివరీ పార్సిల్‌ను అందించేందుకు వచ్చిన ఓ యువకుడు...పెంపుడు కుక్క అరవడంతో భయపడి అపార్టుమెంట్‌ మూడో అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో తీవ్రగాయాలపాలవగా ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం సాయంత్రం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీలోని శ్రీనిధి హైట్స్‌ అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్తులో అద్దెకు ఉంటున్న నీలారాణి మూడు రోజుల క్రితం అమెజాన్‌లో పరుపు(బెడ్‌)ను ఆర్డర్‌ చేసింది. దాంతో ఆదివారం దాన్ని తీసుకుని డెలివరీ బాయ్‌ ఇలియాజ్‌ వారి ఇంటికి లిఫ్ట్‌లో వచ్చాడు.

అతను తెచ్చిన బెడ్‌ను తలుపు తెరచి ఉండటంతో ఇంట్లోకి నేరుగా వచ్చి హాల్‌లో వేశాడు. దాని చప్పుడుకు ఇంట్లో ఉన్న లాబ్‌ జాతి కుక్క ఒక్కసారిగా అరవటంతో అతను భయపడి పోయాడు. ఆ సమయంలో కుక్క ఎక్కడ కరుస్తుందో అనే భయంతో ఏకంగా మూడవ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకాడు. నేరుగా అపార్ట్‌మెంట్‌ ప్రహరీగోడపై పడటంతో నడుము భాగంలో గాయమయ్యింది. దీంతో నీలారాణి భర్త డాక్టర్‌ సుబ్బరామిరెడ్డి సపర్యలు చేసి 108కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి పంపారు.

డెలివరీ బాయ్‌ ఉదయం ఫోన్‌ చేసి ఈరోజు డెలివరీ చేస్తామని చెప్పాడని, వచ్చే ముందు ఎలాంటి ఫోన్‌ చేయటం, ఇంటి ముందుకు వచ్చి బెల్‌ కొట్టడం చేయలేదని, నేరుగా ఇంట్లోకి రావడం వల్లే కుక్క అరిచిందని నీలారాణి తెలిపారు. బాధితుడు తన అన్నకు ఫోన్‌ చేయటంతో ఓవైసీ ఆసుపత్రికి తీసుకుని రావాలని చెప్పటంతో 108 సిబ్బంది అతన్ని అక్కడకు తరలించినట్టు సమాచారం. రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సమాచారం సేకరించారు. అనంతరం నీలారాణిపై కేసు నమోదు చేశారు.

చదవండి: కొత్త రేషన్‌ కార్డులు ఇప్పట్లో లేనట్టే!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)