Breaking News

పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక..

Published on Wed, 12/10/2025 - 07:45

నల్లగొండ, మర్రిగూడ: పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం నల్లగొండ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్‌లో జరిగింది. టూటౌన్‌ ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం కొట్టాల గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, రమణమ్మ దంపతుల కుమార్తె శ్రుతి (20) నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతూ.. స్థానికంగా రవీంద్రనగర్‌లోని బీసీ బాలికల హాస్టల్‌లో ఉంటోంది. 

శ్రుతికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండగా, ఆమెకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంటికి వెళ్తానని హాస్టల్‌ వార్డెన్‌కు లీవ్‌ లెటర్‌ రాసి బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. బాత్‌రూమ్‌లో నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థినులు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్‌ ఎస్‌ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రుతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)