Breaking News

జూడాల సమ్మె బాట

Published on Sun, 04/09/2023 - 02:50

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, పలు డిమాండ్లపై వినతులు ఇచ్చినా స్పందించకపోవడంతో జూనియర్‌ డాక్టర్లు సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు.  సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు సమర్పించారు.

వీటిని ఈనెల 10వ తేదీ నాటికి పరిష్కరించాలని, లేకుంటే ఈనెల 11వ తేదీ నుంచి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. మిగతా విధులను బహిష్కరించనున్నట్లు వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డికి తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ కౌషిక్‌ కుమార్‌ పింజర్ల, డాక్టర్‌ ఆర్‌.కె.అనిల్‌ కుమార్‌  నోటీసులు అందించారు.

♦ జూనియర్‌ డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సు చేసే ప్రతి వైద్యుడు తప్పకుండా డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం(డీఆర్‌పీ) తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. వంద పడకల ఆస్పత్రిలో కనీసం 3 నెలల పాటు సేవలందించాలి. వైద్య విధాన పరిషత్‌ అధికారులు జూనియర్‌ డాక్టర్లకు రొటేషన్‌ పద్ధతిలో అక్కడ డ్యూటీలు వేస్తారు. ఈ క్రమంలో జూడాలు నిర్దేశించిన ఆస్పత్రి పరిధిలోనే ఉండాలి. అయితే ఈ కార్యక్రమం అమలు లోటుపాట్లపై జూడాలు ఫిర్యాదులు చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించి వసతి, భోజనం, భద్రత సౌకర్యా లు కల్పించాలని కోరుతున్నారు.  ప్రభు త్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

♦  ఇక జూనియర్‌ డాక్టర్లకు స్టైఫండ్‌ విడుదలలో కూడా జాప్యం జరుగుతోంది. నెలల తరబడి నిధులు విడుదల చేయడం లేదు. బిల్లులు ఆమోదించినప్పటికీ ఆర్థిక అనుమతులు లేకపోవడంతో నిధులు విడుదల కావడం లేదని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. 

♦  స్టైఫండ్‌ పెంపు ప్రతి రెండేళ్లకోసారి చేపట్టాలి.  ఏళ్లు గడుస్తున్నా స్టైఫండ్‌ పెంపు లేకపో వడం పట్ల జూడా సంఘం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)