Breaking News

డెక్కన్‌ మాల్‌ ఫైల్‌ ఎక్కడ?.. కూల్చివేతపై సస్పెన్స్‌!

Published on Fri, 01/20/2023 - 16:32

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో డెక్కన్‌ మాల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి.. రెండు మృతదేహాలను గుర్తించారు. మంటలు పూర్తిగా చల్లారకపోవడంతో.. డ్రోన్‌ కెమెరా ద్వారా పర్యవేక్షణ చర్యలు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నాం తర్వాత బిల్డింగ్‌ వెనక రెండు మృత దేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఘోర ప్రమాదానికి కారణమైన బిల్డింగ్‌ కూల్చివేతపై అనుభవం కలిగిన ఏజెన్సీని జీహెచ్‌ఎంసీ సంప్రదించినట్లు సమాచారం. అయితే కూల్చివేత విషయంలో ఇంకా క్లారిటీ రాకపోగా.. బిల్డింగ్‌ ఫైల్‌ విషయంలో ఇవాళ పెద్ద హైడ్రామానే నడిచింది. 

డెక్కన్‌ మాల్‌ బిల్డింగ్‌కు సంబంధించిన ఫైల్‌ విషయంలో జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ‘ ఫైల్ మా దగ్గర లేదంటే మా దగ్గర లేద’ని అధికారులు వాదులాడుకున్నారు. అయితే.. ఈ  అక్రమ భవనంపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని ఓ వర్గం చెప్పడం గమనార్హం. మరోవైపు ఆ ఫైల్‌ దొరికితేనే.. కూల్చివేతకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. 

మరోవైపు ఫైల్‌తో సంబంధం లేకుండా.. భవన కూల్చివేతకు సంబంధించి ఒక స్కెచ్ జీహెచ్‌ఎంసీ అధికారులు తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి.. కూల్చివేతపై ఇవాళే ఓ స్పష్టత రావొచ్చని భావిస్తున్నారు. 

ఇక.. బిల్డింగ్ కూల్చివేతపై నగరానికే చెందిన మాలిక్ ట్రేడింగ్ అండ్ డీమాలిషన్ సంస్థ ప్రతినిధులతో జీహెచ్‌ఎంసీ ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. బిల్డింగ్ కూల్చడం, వ్యర్థాల తొలగింపు అంశాలను పరిశీలించారు ఇంజినీర్లు. బిల్డింగ్ హైట్, ఆకారం, లోపల గదుల ఆధారంగా డిమాలిషన్ చేయడానికి ప్లానింగ్ రూపొందిస్తున్నారు. పరిస్థితులను బట్టి మూడు, నాలుగు రోజుల్లో కూల్చడం పూర్తవుతుందని ఏజెన్సీ నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో.. జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులతో యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. అయితే.. కూల్చివేతతో చుట్టుపక్కల భవనాల పరిస్థితిపై ఈ ఉదయం ఆందోళన వ్యక్తం కాగా.. జీహెచ్‌ఎంసీ నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)