Breaking News

నదీగర్భంలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం

Published on Mon, 06/09/2025 - 01:18

కాళేశ్వరం: వివాహ వేడుకలకు హాజరై.. సరదా కోసం ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు నదీగర్భంలో ఆదివారం లభ్యమయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ ఎగువన మూడవ బ్లాక్‌ వద్ద గోదావరి లోతు ప్రవాహ ప్రాంతంలో అంబట్‌పల్లికి చెందిన పట్టి వెంకట్‌స్వామి ఇద్దరు కుమారులు మధుసూదన్‌ (18), శివమనోజ్‌ (15), కర్ణాల సాగర్‌ (16), తొగరి రక్షిత్‌ (13), మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రామ్‌చరణ్‌ (17), అదే మండలం స్తంభంపల్లి (పీపీ)కి చెందిన పసుల రాహుల్‌ (19)తో మేడిగడ్డ బ్యారేజీ చూసి గోదావరిలో ఈతకు వెళ్లి శనివారం సాయంత్రం 6 గంటలకు నీట మునిగారు. ఆ ఘటనలో పట్టి శివమణి (18) ప్రాణాలతో బయటపడ్డాడు.  

ముమ్మర గాలింపు.. 
ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి భూపాలపల్లి ఏఎస్పీ నరేశ్‌కుమార్, కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ డీఎస్పీ వేణుగోపాల్‌రెడ్డి, డీడీఆర్‌ఎఫ్, స్థానిక, సిరొంచ జాలర్లు, సింగరేణి రెస్క్యూ టీంలు స్పీడ్‌ బోట్లు, నాటు పడవల సాయంతో ముమ్మరంగా గాలించాయి. 

ఏడు గంటలపాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఆరుగురి మృతదేహాల ఆచూకీ నీటమునిగిన ప్రాంతం నుంచి 50 మీటర్ల దూరంలో లభించింది. మృతదేహాలను వెలికి తీసి అంబులెన్స్‌ల ద్వారా మహదేవపూర్‌ సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబాలకు మృతదేహాలు అప్పగించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో మేడిగడ్డ ప్రాంతం శోకసంద్రంగా మారింది.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)