Breaking News

ఈడ్చుకెళ్లి... గొంతుకోసి..

Published on Thu, 07/23/2026 - 04:00

చిలకలగూడ (హైదరాబాద్‌): ఆస్తి తగాదాల నేపథ్యంలో ఒంటరిగా ఉంటున్న అత్తపై కూరగాయలు కోసే కత్తితో కోడలు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... చిలకలగూడ ఎరుకలబస్తీకి చెందిన దేవరాయ పద్మావతి (57)కి కోడలు విజయలక్ష్మికి మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో మనస్పర్ధలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరచూ ఇరువురి మధ్య తగాదాలు జరుగుతున్నాయి. పద్మావతి భర్త ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందారు. 

మొదటి అంతస్తులో అత్త పద్మావతి ఒంటరిగా ఉండగా, గ్రౌండ్‌ఫ్లోర్‌లో కుమారుడు, కోడలు విజయలక్ష్మి ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఫస్ట్‌ఫ్లోర్‌ను కుమార్తెకి రాసిస్తానని పద్మావతి చెప్పడంతో నాలుగేళ్లుగా అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 21వ తేదీన వివాదం తీవ్రమై అత్తను ఇంట్లోకి ఈడ్చుకెళ్లిన కోడలు కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు, చేతులపై దాడి చేసింది. 

పద్మావతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్ధలానికి చేరుకుని రక్తపుమడుగులో పడున్న ఆమెను హుటాహుటిన గాం«దీఆస్పత్రికి తరలించారు. కోడలు అత్తపై దాడి చేస్తున్న దృశ్యాలు ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విజయలక్ష్మిని బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వైద్యసేవల అనంతరం అత్త పద్మావతి కోలుకుంటున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

ప్రాణం తీసిన ప్రయోగం 
బ్యాటరీ పేలి బాలుడు మృతి
కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఘటన    
చింతలమానెపల్లి: ప్రయోగాలు చేయాలనే ఉత్సాహమే ఆ బాలుడి ప్రాణాలు తీసింది. బ్యాటరీతో ప్రయోగం చేస్తూ బాలుడు మృతిచెందిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానెపల్లి మండలం గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నికాడి గణేశ్, శారద దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు లోకేశ్‌ (14) స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవా రం ఉదయం తండ్రి వ్యవసాయ పనులకు వెళ్లగా, తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమైంది. 

పాఠశాలకు వెళ్లకుండా ఉదయం 10గంటలకు లోకేశ్‌ ఇంట్లోని బ్యాటరీతో ప్ర యోగాలు చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. బాలుడి ముఖం, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి నోటితోపాటు దవడలు ఛిద్ర మై తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. 

ఘటనాస్థలిని కౌటాల సీఐ సంతోష్‌ కుమార్, చింతలమానెపల్లి ఎస్సై కమలాకర్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కమలాకర్‌ తెలిపారు. లోకేశ్‌కు చిన్నతనం నుంచే బ్యాట రీలు, ఎలక్ట్రికల్‌ వైర్లతో ప్ర యోగాలు చేసే అలవాటు ఉంది. ఇంట్లోని సైకిల్‌కు లైట్లను అమర్చడం, బ్యాటరీతో అనుసంధానించడం వంటి పనులు చేస్తుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)