Breaking News

చేతులెత్తి మొక్కుతున్నాం.. 

Published on Tue, 03/12/2024 - 02:50

సాక్షి, హైదరాబాద్‌/పంజగుట్ట: ఎమ్మెల్సీలుగా రాజ్యాంగబద్ధంగా నామినేటైన తమ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ.. గవర్నర్‌ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను ఆమోదించాల్సిందిగా చేతులెత్తి మొక్కుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సోమవారం రాజ్‌భవన్‌లో వినతిపత్రం సమరి్పంచారు. తమ విజ్ఞాపనతో పాటు ఇటీవల హైకోర్టు వెలువరించిన 88 పేజీల తీర్పు కాపీని కూడా జత చేసి గవర్నర్‌ కార్యాలయంలో అందజేశారు. తమను ఎమ్మెల్సీలుగా ఆమోదించాలని రాజ్‌భవన్‌ గేట్లకు మొక్కారు. 

రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టుకు 
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేసినా, 55 రోజుల తర్వాత కేబినెట్‌ ప్రతిపాదనను గవర్నర్‌ తిరస్కరించారని దాసోజు శ్రవణ్‌ మీడియాకు తెలిపారు. అయితే తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్‌ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించామన్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం గవర్నర్‌ కోటాలో కోదండరాం, అమేర్‌ అలీఖాన్‌ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్‌ ఆమోదించారన్నారు. ఈ మేరకు గెజిట్‌ కూడా విడుదల కాగా, కోదండరాం, అమేర్‌ అలీఖాన్‌లను నామినేట్‌ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని హైకోర్టు పేర్కొందన్నారు. అట్టడుగు కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలని దాసోజు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తాము ఇద్దరూ గతంలో బీజేపీ, దాని అనుబంధ విభాగాల్లో పనిచేశామని దాసోజు, కుర్రా సత్యనారాయణ తమ వినతిపత్రంలో పేర్కొన్నారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)