Breaking News

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

Published on Wed, 10/30/2024 - 18:33

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని వెల్లడించింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

అక్టోబర్ 26న కేబినెట్ భేటీలో ఉద్యోగులకు  పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదలకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీపావళి పండుగ వేళ పెండింగ్‌‎లో ఉన్న డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

👉పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి వర్తింపు

👉డిసెంబర్ 1న చెల్లించే నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపు

👉2022 జులై 1 నుంచి ఈనెల వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ

👉సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ

👉సీపీఎస్ ఉద్యోగులకు మిగతా 90 శాతం 17 వాయిదాల్లో చెల్లింపు

👉సీపీఎస్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లింపులు

👉జీపీఎఫ్ ఖాతాలు లేని పుల్టైం కంటింజెంట్ ఉద్యోగులకు 17 వాయిదాల్లో చెల్లింపు

👉కంటింజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లింపులు

👉రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 2025 జనవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లింపు
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)