Breaking News

23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపాను

Published on Mon, 10/21/2024 - 05:39

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో ఈనెల 23న తుపాను ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతంలో ఎగువ గాలులతో ఏర్పడిన చక్రవాతపు ఆవర్తనం ప్రభావం వల్ల సోమవారం ఉదయానికి తూర్పు–మధ్య బంగాళాఖాతం, పరిసర ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈ నెల 22వ తేదీ ఉదయం కల్లా వాయుగుండంగా మార్పు చెందుతుందని వెల్లడించింది.

 ఆ తర్వాత వాయుగుండం బలపడి ఈనెల 23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వివరించింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24వ తేదీ ఉదయం కల్లా ఒడిశా–పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మరోవైపు ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి, పరిసర పశి్చమ మధ్య బంగాళాఖాతంలో మరో చక్రవాతపు ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బలపడి అల్పపీడనం, ఆ తర్వాత వాయుగుండంగా మార్పు చెందే క్రమంలో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

 ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగుడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబా­బాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. రాను­న్న రెండు రోజులు రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవు­తాయని వాతావరణ శాఖ వివరించింది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)