Breaking News

అసలే ఇరుకు..ఆపై సైకిల్‌ ట్రాక్‌

Published on Wed, 05/24/2023 - 10:50

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు చుట్టూ ప్రధాన రహదారిని కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌(సీఆర్‌ఎంపీ) ఏజెన్సీ నిర్వహిస్తోంది. రోడ్లపై గుంతలు పడినా, ఫుట్‌పాత్‌లు దెబ్బతిన్నా కొత్తగా రోడ్డు వేయాలన్నా, తవ్వాలన్నా సీఆర్‌ఎంపీ నిర్వహణలోనే చేపట్టాలి. అయితే గత కొంత కాలంగా కేబీఆర్‌ పార్కు చుట్టూ సైకిల్‌ ట్రాక్‌  నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో భాగంగా  రెండేళ్లుగా ఫుట్‌పాత్‌లను ఆనుకుని సైకిల్‌ ట్రాక్‌ బొల్లార్డ్స్‌ కోసం గుంతలు తీశారు. వర్షాలకు ఈ గుంతలు నిండిపోయి పార్కుకు వచ్చే వాకర్లు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం పేరుతో పార్కు చుట్టూ సదరు సంస్థ రోడ్డును ఛిద్రం చేసింది. నాలుగైదు సార్లు గుంతలు తీసి పూడ్చి రూ. లక్షల్లో నిధులు వృథా చేశారు. జీహెచ్‌ఎంసీ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా పార్కు చుట్టూ సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణ పనుల కోసం తవ్వకాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే పార్కు చుట్టూ రోడ్డు ఇరుగ్గా ఉందని ఈ సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం చేపడితే సమస్య జఠిలంగా మారుతుందని, వాహహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదని కేబీఆర్‌ పార్కుకు వచ్చే వాకర్లు, సందర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. తక్షణం పార్కుచుట్టూ సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణ పనులు నిలిపివేయాలని తీసిన గుంతలను పూడ్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. సీఆర్‌ఎంపీ నిర్వాకంతో పార్కు చుట్టూ రోడ్డు అధ్వానంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)