Breaking News

‘మీ కూతురు కెనడాలో డ్రగ్స్‌ కేసులో పట్టుబడింది’

Published on Mon, 06/23/2025 - 08:15

సాక్షి, హైదరాబాద్‌: ‘మీ కూతురు కెనడాలో డ్రగ్స్‌ కేసులో పట్టుబడింది. ఈ కేసు నుంచి మీ కూతుర్ని తప్పించాలంటే మేం చెప్పిన ఫోన్‌పే నంబర్‌కు రూ.50 వేలు వెంటనే పంపండి’అంటూ బురిడీ కొట్టించేందుకు సైబర్‌ నేరగాళ్లు విశ్వ ప్రయత్నం చేశారు. అయితే వారి వలకు చిక్కకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు నగరవాసి శ్రీనివాస్‌రెడ్డి. కేసు వివరాల్లోకి వెళితే..సరూర్‌నగర్‌కు చెందిన ప్రైవేట్‌ సెక్యూరిటీ సంస్థను నడిపే శ్రీనివాస్‌రెడ్డికి ఈనెల 19న ఒక వాట్సప్‌ కాల్‌ వచ్చింది. 

అందులో పేరు సీబీఐ విక్రమ్‌గా..డీపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా ఫొటో ఉంది. అవతలి నుంచి ఒక మహిళ ఇంగ్లిష్‌ లో మాట్లాడుతూ.. మీ కూతురు కెనడాలో డ్రగ్స్‌ కేసులో పట్టుబడింది అని చెప్పింది. వెంటనే డబ్బులు పంపితే ఆమెను ఈ కేసు నుంచి వదిలేస్తామని లేదంటే థర్డ్‌ డిగ్రీ తప్పదని బెదిరించడం ప్రారంభించింది. ఫోన్‌ పే చేయాలంటూ ఒక నంబర్‌ ఇచ్చింది. 

పదేపదే డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుండడంతో అనుమానించిన శ్రీనివాస్‌రెడ్డి ఆ వాట్సప్‌ కాల్‌ను కట్‌ చేసి, కెనడాలో ఉన్న కూతురుకు ఫోన్‌ చేశారు. ఇంట్లోనే నిద్రపోతున్నానని..తాను క్షేమంగానే ఉన్నానని...ఎలాంటి సమస్య లేదని కూతురు చెప్పింది. దీంతో తన అనుమానం నిజమైందని గుర్తించిన శ్రీనివాస్‌రెడ్డి సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు. సైబర్‌ నేరగాళ్లు చేసిన ఫోన్‌ నంబర్‌ పాకిస్తాన్‌ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. తనను మోసగించేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్‌రెడ్డి తన ఫిర్యాదులో కోరారు. టీజీ సీఎస్‌బీ డీఎస్పీ కేవీఎం ప్రసాద్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)