Breaking News

గాంధీకి స్టేషన్‌ బెయిల్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు అందుకే అరెస్ట్‌: సీపీ అవినాష్‌ మహంతి

Published on Fri, 09/13/2024 - 16:54

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిష్‌ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య ఘర్షణ ఎపిసోడ్ రాజకీయంగా చర్చకు దారి తీసింది. వాదనలు, ఘర్షణల సందర్భంగా ఇరు వర్గాల నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక, అరెస్ట్‌లపై తాజాగా సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి కేసులో అరికెపూడి గాంధీని అరెస్ట్‌ చేసి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగానే హరీష్‌రావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నాం. హరీష్‌రావుకు అరెస్ట్‌ చేసిన నోటీసు ఇచ్చి పంపించివేశాం. పోలీసుల విధులకు కౌశిక్‌రెడ్డి ఆటంకం కలిగించారని మరో కేసు నమోదైంది. కౌశిక్‌, గాంధీలపై మూడు కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.

ఇదిలా ఉండగా.. హుజురాబాద్ బీఆర్‌ఎస్‌‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్‌ నేతలు శుక్రవారం (సెప్టెంబర్‌13) స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డి ఓటర్లను బెదిరించి గెలిచారని, గెలిచాక మహిళలను కించపరుస్తూ మాట్లాడినందున కౌశిక్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.

అయితే, పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా కౌశిక్‌రెడ్డి మీడియా సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి చీర,గాజులను పంపిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: కౌశిక్‌ వ్యాఖ్యలపై కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటి రెడ్డి

Videos

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)