సైబర్‌ క్రైమ్‌ సొమ్ముతో ఎన్నారై మహిళకు టోకరా

Published on Tue, 08/13/2024 - 08:38

బంజారాహిల్స్‌: సైబర్‌ మోసంలో సంపాదించిన డబ్బుతో ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ ఇల్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి పథకం ప్రకారం ఆమె ఇంటిని కబ్జా చేసి ఆమె బ్యాంకు ఖాతాను సైబర్‌ పోలీసులు సీజ్‌ చేసే విధంగా పావులు కదిపిన ఘటనలో నిందితుడిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... అమెరికాలో నివసించే డాక్టర్‌ బినోతి మార్తాండ్‌కు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.52లోని నందగిరిహిల్స్‌ లే అవుట్‌లో ప్లాట్‌ నెంబర్‌ 81లో 334 గజాల్లో ఇల్లు ఉంది. 2022లో సదరు ఇంటిని అమ్మకానికి పెట్టిన ఆమె ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో కూడా వివరాలు నమోదు చేశారు.

 అలాగే గురునాథ్‌ అనే వ్యక్తిని  అమ్మకానికి సంబంధించి ఎంక్వైరీ కోసం ఏజెంట్‌గా నియమించుకున్నారు. 2022లో ఆమె యూఎస్‌లో ఉండగా ఎస్‌బీకే గ్రూప్‌ చైర్మన్‌ బాబు అలియాస్‌ షేక్‌ బషీర్‌ పేరుతో వాట్సాప్‌ కాల్‌ వచి్చంది. నందగిరిహిల్స్‌లోని మీ ప్లాట్‌ను కొనడానికి సిద్ధంగా  ఉన్నట్లు షేక్‌ బషీర్‌ చెప్పడంతో ఆమె ఇంటిని రూ. 12.50 కోట్లకు విక్రయిస్తున్నట్లు తెలిపింది. సదరు మొత్తాన్ని షేక్‌ బషీర్‌ ఆరీ్టజీఎస్‌ ద్వారా పలుమార్లు ఆమె ఖాతాకు బదిలీ చేశాడు. ఈ ఏడాది జూలై 18న ఈ మొత్తం ఆమె ఖాతాలో జమ చేసినట్లు ఆధారాలు పంపించిన అతను అదే రోజు తాను ఇంట్లో దిగుతున్నానంటూ ఆమెకు ఫోన్‌చేసి చెప్పి ఇంటిని తన ఆ«దీనంలోకి  తీసుకున్నాడు.  జూలై 19న ఆమెకు బ్యాంకు నుంచి మీ అకౌంట్‌ ఫ్రీజ్‌ చేస్తున్నామంటూ సైబర్‌ పోలీసులు నోటీసు పంపడంతో నివ్వెరపోయింది.

 వెంటనే ఆమె బాబు అలియాస్‌ షేక్‌ బషీర్‌కు ఫోన్‌ చేయగా స్పందించలేదు. బ్యాంకు అధికారులను ఆరా తీయగా ఈ మొత్తం డబ్బు సైబర్‌ మోసం ద్వారా సంపాదించినదని చెప్పారు. అంతే కాకుండా షేక్‌ బషీర్‌ ఆమె ఇంటిని ఆక్రమించమే కాకుండా చంపేస్తానని బెదిరించాడు. ఆమె ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు తొలగించి తాజాగా తన సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాడు. జూలై 28న   ఇండియాకు వచి్చన బాధితురాలు తన కుమారుడితో కలిసి ఇంటికి వెళ్లగా బషీర్‌ అనుచరులు అందులో ఉన్నారు. తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఇంటిని స్వా«దీనం చేసుకున్న నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు బషీర్‌ కోసం గాలిస్తున్నారు.

 

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)