Breaking News

మీ కొడుకు రేప్‌ కేసులో దొరికాడు

Published on Wed, 01/22/2025 - 08:18

బొంరాస్‌పేట: ‘హలో..ఆప్‌ కా బేటా రేప్‌ కేస్‌ మే మిల్‌గయా. ఛోడ్‌దేనా బోలేతో పచాస్‌ హజార్‌ అర్జెంట్‌ పే కరో.. నైతో జైల్‌మే దాల్‌దేతే’.. (నీ కొడుకు అత్యాచార ఘటనలో దొరికాడు. అతడిని విడిచిపెట్టాలంటే వెంటనే రూ.50 వేలు ఫోన్‌ పే చేయండి. లేదంటే జైలులో వేస్తాం) అంటూ వచ్చిన ఫోన్‌కాల్‌తో ఓ తండ్రి భయాందోళనకు గురయ్యాడు. ఏం చేయాలో తోచక పక్కనున్న తన సన్నిహితుడికి ఫోన్‌ ఇచ్చి మాట్లాడించాడు. ఇది సైబర్‌ నేరగాళ్ల పని అని తెలుసుకొని ఫోన్‌ కట్‌ చేశారు. 

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లా రేగడిమైలారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు శ్యామలయ్యగౌడ్‌ స్థానికంగా కిరాణదుకాణం నడిపిస్తున్నాడు. ఇతని చిన్న కొడుకు సత్యనారాయణగౌడ్‌ భార్యాపిల్లలతో హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం 10.38 గంటలకు శ్యామలయ్యగౌడ్‌కు ఓ నంబరు నుంచి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడుతూ.. నీ కొడుకు ఓ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో దొరికాడని చెప్పాడు.ఫోన్‌లో పోలీస్‌ వాహనాల సైరన్‌ వినిపిస్తూ సత్యనారాయణను అరెస్టు చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేశాడు.

 హడలిపోయిన శ్యామలయ్యగౌడ్‌ వెంటనే పక్కనున్న వ్యక్తికి ఫోన్‌ ఇచ్చాడు. సైబర్‌ నేరగాళ్లుగా అనుమానించిన ఆయన పోలీస్‌స్టేషన్‌ వివరాలు అడగగా అవతలి వ్యక్తి పరుషపదజాలంతో తిట్టాడు. దీంతో ఫేక్‌ అని భావించి ఫోన్‌ కట్‌ చేశాడు. ఆ వెంటనే సత్యనారాయణకు ఫోన్‌ చేయగా, తాను ఆఫీసులో ఉన్నానని తండ్రికి చెప్పాడు. కొడుకుతో వీడియోకాల్‌ మాట్లాడిన తర్వాత తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. అనంతరం ఈ ఘటనపై నేషనల్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు ఫోన్‌ చేసి, ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఫోన్‌కాల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)