Breaking News

జెడ్పీటీసీ టిక్కెట్‌ ఇప్పిస్తా...రూ.లక్ష పంపు

Published on Sat, 10/11/2025 - 09:30

విజయవాడ: సైబర్‌ నేరగాళ్లు కొత్త అవతారం ఎత్తారు. రాజకీయ నాయకుల వాయిస్‌తో మాట్లాడుతూ ఓ సొసైటీ అధ్యక్షుడిని రూ. లక్ష అడిగి విఫలయత్నం చేశారు. మూరకొండ ఏడుకొండలరావు కంచికచర్ల మండలం ఘనిఆత్కూరు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు ఈ నెల 8న రాత్రి వాట్సాప్‌ కాల్‌చేసి మాజీ మంత్రి దేవినేని ఉమా వాయిస్‌లో మాట్లాడి ఎక్కడున్నావ్‌ అని అడిగారు. నేను పక్క ఊరిలో ఉన్నానని చెప్పగా, ఒకసారి కారులో ఎక్కి మాట్లాడమని సైబర్‌ నేరగాళ్లు చెప్పారు. 

అదే విధంగా కారులో కూర్చుని ఏమిటండీ అని అడగ్గా, రానున్న జెడ్పీటీసీ ఎన్నికల్లో నీకు కంచికచర్ల, మైలవరం, ఇబ్రహీంపట్నంలలో ఏదో ఒకటి టికెట్‌ ఇప్పిస్తా, డబ్బులు ఎంత పెట్టుకుంటావని అడిగారు. మరలా ఐదు నిమిషాల తర్వాత ఫోన్‌కాల్‌ చేసి అన్నగారు (చంద్రబాబు) మాట్లాడతారంటా అని చెప్పి, ఫోన్‌ ఇవ్వగా, ఆయన వాయిస్‌తోనే మాట్లాడారు. దీంతో ఏడుకొండలరావుకు అనుమానం వచ్చింది. 

కొద్దిసేపటి ఒక రూ.లక్ష వేరేవారికి ట్రాన్స్‌ఫర్‌ చేయమని సైబర్‌ నేరగాళ్లు అడగ్గా, మరుసటి రోజు నేను  క్యాష్‌ ఇస్తానని చెప్పి ఫోన్‌ పెట్టేశారు. మరుసటి రోజు ఫోన్‌ చేసి డబ్బులు విజయవాడలో ఎక్కడ ఇవ్వాలో చెప్పారు. 10వ తేదీ డబ్బులు ఇచ్చేందుకు రమ్మని చెప్పడంతో ఆయన బయలుదేరి నేరుగా గొల్లపూడిలోని దేవినేని ఉమా కార్యాలయానికి వెళ్లి, ఫోన్‌ చేసిన విషయం చెప్పారు. తాను ఫోన్‌ చేయలేదని చెప్పడంతో సైబర్‌ నేరగాళ్ల వల అని తెలుసుకుని సైబర్‌  క్రైమ్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)