Breaking News

నయా మోసం.. కాల్‌ఫార్వర్డింగ్‌ ఫిషింగ్‌

Published on Mon, 06/09/2025 - 04:34

సాక్షి, హైదరాబాద్‌: కాల్‌ఫార్వర్డింగ్‌ ఫిషింగ్‌ మోసం ఇప్పుడు తెరపైకి వస్తోంది. కొరియర్‌ సంస్థల పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరించారు. ఈ తరహా మోసం ఎలా జరుగుతుంది.. ఎలా అప్రమత్తంగా ఉండాలన్న అంశాలతో టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖాగోయల్‌ ఒక ప్రకటన జారీ చేశారు.  

ఇలా వల వేస్తారు... 
కొరియర్‌ సంస్థల పేరుతో, ముఖ్యంగా బ్లూడార్ట్‌ వంటి సంస్థల పేరిట మోసగాళ్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. మీ పేరిట కొరియర్‌ వచి్చందంటూ బాధితులకు కాల్‌ చేస్తారు. మా కొరియర్‌ బాయ్‌ మీకు దగ్గర్లో ఉన్నాడని, లొకేషన్‌ గుర్తులు అవసరమని చెప్పి నమ్మకం కలిగిస్తారు. తర్వాత మీకు పంపిన లింక్‌పై క్లిక్‌ చేయాలని సూచిస్తారు. అలా పంపిన లింక్‌పై క్లిక్‌ చేయగానే ఫోన్‌లో వైరస్‌ను పంపి బాధితుల ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకుంటారు. లేదా 21 ఫోన్‌ నంబర్‌ వంటి ప్రత్యేక కోడ్‌ డయల్‌ చేయాలని చెబుతారు.

ఆ తర్వాత ఫోన్‌కాల్‌ ఫార్వర్డింగ్‌ యాక్టివేట్‌ చేస్తారు. కాల్‌ ఫార్వర్డింగ్‌ యాక్టివేట్‌ అయిన తర్వాత, బాధితుల ఫోన్‌ను మోసగాళ్లు హైజాక్‌ చేస్తారు. ఆ తర్వాత బాధితుల ఫోన్‌కు వచ్చే కాల్స్, ఓటీపీలు, వెరిఫికేషన్‌ కోడ్‌లు తెలుసుకుంటారు. అదేవిధంగా వాట్సాప్‌ సహా అన్ని సోషల్‌ మీడియా యాప్‌లు, ఫోన్‌ గ్యాలరీపైన నియంత్రణ సైబర్‌ మోసగాళ్లకు వెళుతుంది. బాధితుడికి ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ సహా ఇతర యాప్‌లేవీ పనిచేయవు. ఇలా బాధితుడి ఫోన్‌లోని కాంటాక్టు నంబర్లకు బాధితుడిగా నటిస్తూ, వారి కాంటాక్ట్స్‌ లో ఉన్న వ్యక్తులకు మెసేజులు పంపించి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని అభ్యర్థిస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడతారు.

ఈ జాగ్రత్తలు పాటించండి..:  
⇒ మీ ఫోన్లో కాల్‌ ఫార్వర్డింగ్‌ ఫీచర్‌ను డిసేబుల్‌ చేయండి. 
⇒ మీ నెట్వర్క్‌ ప్రొవైడర్‌ను సంప్రదించి కాల్‌ ఫార్వర్డింగ్‌ ఆపేయండి. 
⇒ కొరియర్‌ కంపెనీలకు వారి అధికారిక వెబ్‌సైట్లో ఉన్న నంబర్లకే కాల్‌ చేయండి. 
⇒ తెలియని లింకులపైన క్లిక్‌ చేయకండి. 

⇒ లేదా ఉన్న కోడ్లు డయల్‌ చేయకండి. 
⇒ ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు ఎవరితోనూ పంచుకోవద్దు.  
⇒ మీ ఫోన్‌ కాల్‌ సెట్టింగ్స్, బ్యాంక్‌ లావాదేవీలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి.  
⇒ ఒకవేళ మోసానికి గురైనట్టు గ్రహిస్తే వెంటనే 1930కు కాల్‌ చేయండి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో లేదా సైబర్‌ ఫ్రాడ్‌ రిజిస్ట్రీ 8712672222 వాట్సాప్‌ నంబర్‌లో ఫిర్యాదు చేయండి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)