Breaking News

సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

Published on Wed, 03/05/2025 - 09:45

సాక్షి, నల్లగొండ: తెలంగాణలో మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా ఎమ్మెల్యేను టార్గెట్‌ చేసి నగ్నంగా వీడియో కాల్‌ చేసి బెదిరింపులకు దిగారు. వీడియో కాల్ సందర్భంగా కొన్ని సెకన్ల పాటు స్క్రీన్ రికార్డు చేసి ఆయనకే వీడియో పంపించారు. అనంతరం, డబ్బులు కావాలని డిమాండ్‌ చేశారు.

వివరాల ప్రకారం.. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సైబర్‌ నేరగాళ్లు వీడియో కాల్‌ చేశారు. దీంతో, ఆయన కాల్‌ లిఫ్ట్‌ చేయడంతో అవతలి వ్యక్తి నగ్నంగా కనిపిస్తూ కాల్‌ మాట్లాడారు. ఈ క్రమంలో కేటుగాళ్లు ఫోన్‌ స్క్రీన్ రికార్డు చేశారు. అనంతరం, ఆ వీడియోను ఆయనకే పంపించారు. వీడియో విషయమై బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్‌ చేశారు. కానీ, ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పంపారు.

ఈ క్రమంలో సదరు నేతలు, కార్యకర్తలు ఆయనను ఫోన్లు చేయడంతో వీరేశం ఖంగుతిన్నారు. దీంతో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు వేముల వీరేశం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, రాత్రి అనుచరులతో ఫోన్‌ మాట్లాడుతుండగా కాల్‌ రావడంతో లిఫ్ట్‌ చేసినట్టు ఆయన తెలిపారు. 

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)