Breaking News

కడెం పరిస్థితిపై సీడబ్ల్యూసీ అధ్యయనం 

Published on Sat, 07/29/2023 - 01:26

కడెం: భారీగా వరదలు రావడం, గేట్లు సరిగా పనిచేయక ఆందోళన నెలకొనడం నేపథ్యంలో నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్‌ భద్రత బృందం శుక్రవారం పరిశీలించింది. మొత్తం 24 మంది అధికారులు, సిబ్బంది డ్యామ్‌ ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేశారు. వరద గేట్ల పనితీరు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సామర్థ్యం, ఎడమ కాల్వ వద్ద కోతకు గురైన రోడ్డు వంటి వాటిని పరిశీలించారు.

ప్రాజెక్టు అధికారులు గతేడాది ప్రాజెక్టుకు వచ్చిన భారీ వరదలతో దెబ్బతిన్న గేట్లు, ఆఫ్రాన్‌ (రక్షణ గోడ), స్పిల్‌వేలను సీడబ్ల్యూసీ బృందానికి చూపించారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్, డ్యాం భద్రత నిపుణుడు ఏబీ పాండ్య మాట్లాడారు. కడెం ప్రాజెక్టు భారీగా వస్తున్న ఇన్‌ఫ్లోతో ప్రమాదం నెలకొని ఉందని, డ్యాం భద్రతకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని తెలిపారు.

ప్రాజెక్టును పరిశీలించిన బృందంలో హైడ్రాలజిస్ట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ రామరాజు, డ్యాం భద్రత నిపుణుడు టి.దేశాయి, జియాలజిస్ట్‌ ఎం.రాజు, హైడ్రో మెకానికల్‌ నిపుణులు కె.సత్యనారయణ, యోగీందర్‌కుమార్‌శర్మ, సీఈ శ్రీనివాస్, ఎస్‌ఈ సుశీల్‌కుమార్, ఈఈ విఠల్, డీఈ భోజదాసు, ప్రాజెక్ట్‌ సిబ్బంది ఉన్నారు. 

శాంతించిన కడెం.. గేట్లకు మరమ్మతులు 
భారీ వరదతో ప్రాజెక్టును కోతకు గురిచేస్తుందా అన్న ఆందోళన రేపిన కడెం వాగు శాంతించింది. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు శుక్రవారం ఉదయం 1,46,675 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. సాయంత్రానికి బాగా తగ్గిపోయింది. రాత్రికి 13,550 క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఏడు గేట్ల ద్వారా 20,998 క్యూస్కెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులుకాగా.. ప్రస్తుతం 685.150 అడుగులుగా ఉంది.

రెండు రోజుల కింద తెరుచుకోకుండా మొరాయించిన 3వ నంబర్‌ గేటుకు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కాగా భారీ వరదతో ఎడమ కాల్వపై మైసమ్మ గుడివద్ద రోడ్డు కోతకు గురైంది. అక్కడ మరమ్మతులు పూర్తిచేసేదాకా సాగునీటిని విడుదల చేసే అవకాశం లేదు. దీనితో వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)