Breaking News

డీజే శబ్దాలపై అనేక ఫిర్యాదులు, ప్రభుత్వానికి నివేదిక: సీవీ ఆనంద్‌

Published on Thu, 09/26/2024 - 15:59

సాక్షి, హైదరాబాద్‌: మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనందర్‌ అధ్యక్షతనగురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగినఈ సమావేశానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రా పాలీ, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులు, మత సంఘాలు నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. డీజే శబ్దాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇంట్లో ఉన్న  వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని, గుండె అదురుతుందని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. డీజే సౌండ్స్ పోనుపోనూ శ్రుతి మించుతున్నాయని, గణేష్ పండుగే కాకుండా మిలాద్ ఉన్ నబిలోనూ డీజే నృత్యాలు విపరీతం అయ్యాయని అన్నారు. పబ్‌లో డ్యాన్సులు చేసినట్లే ర్యాలీల్లో చేస్తున్నారని చెప్పారు.

డీజే శబ్దాలపై కంట్రోల్ లేకపోతే ఆరోగ్యాలు దెబ్బ తింటాయన్నారు సీవీ ఆనంద్‌ డీజే శబ్దాలు కట్టడి చేయాలని కోరుతూ తమకు అనేక సంఘాల నుంచి వినతులువచ్చాయని అన్నారు. డీజేల వల్ల ఆరోగ్య సమస్యలే కాకుండా భద్రతకు ముప్పు ఉందన్నారు. అందుకే పలు వర్గాలను పిలిచామని, అందరి అభిప్రాయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. తమ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

డీజే, బాణాసంచా సౌండ్స్ పై కీలక నిర్ణయం

 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)