Breaking News

చేదెక్కిన చెరకు

Published on Mon, 07/14/2025 - 04:58

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గుతోంది. ఫ్యాక్టరీల క్రషింగ్‌ సామర్థ్యానికి సరిపోను దిగుబడి కూడా ఉండటం లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. చెరకు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఇతర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా వరిసాగుకు సై అనడంతో చెరుకు సాగు విస్తీర్ణం పెరగడం లేదని ఫ్యాక్టరీల యాజమాన్యాలు, చెరకు విభాగం అధికారులు చెబుతున్నారు. 

చెరకు పరిశ్రమ ద్వారా ఒక్కో మెట్రిక్‌ టన్నుపై ప్రభుత్వానికి జీఎస్‌టీ రూపంలో రూ.250 వరకు సమకూరుతోంది. చెరకు ఏడాది పంట కావడంతో టన్నుకు రూ.1,000 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. చెరకు ఫ్యాక్టరీలకు అవసరమైన ముడి సరుకుతోపాటు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పనలో కీలకంగా ఉన్న చెరకు పరిశ్రమను ప్రోత్సహించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరకు రైతులకు బోనస్‌ ప్రకటించేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెరకు విభాగం అధికారులు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. 

మూడోవంతు విస్తీర్ణంలోనే సాగు ! 
రాష్ట్రంలో 12 చక్కెర కర్మాగారాలు ఉండగా, ఐదు కర్మాగారాలు మూత పడ్డాయి. ప్రస్తుతం ప్రైవేట్‌ రంగంలోని ఏడు చక్కెర కర్మాగారాలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి క్రషింగ్‌ సామర్థ్యం రోజుకు 24,700 మెట్రిక్‌ టన్నులు. 130 రోజుల క్రషింగ్‌ సీజన్‌ను పరిగణనలోకి తీసుకొని లెక్క వేస్తే మొత్తంగా ఫ్యాక్టరీల క్రషింగ్‌ సామర్థ్యానికి అనుగుణంగా 32.11 లక్షల మెట్రిక్‌ టన్నుల చెరకు అవసరం. రాష్ట్రంలో 40వేలకు పైగా హెక్టార్లలో చెరుకు సాగు చేస్తేనే ఈ ఏడు ఫ్యాక్టరీల క్రషింగ్‌ సామర్థ్యానికి అనుగుణంగా దిగుబడి వస్తుందని యాజమాన్యాలు చెబుతున్నాయి. 

కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 21వేల హెక్టార్లలో మాత్రమే రైతులు చెరకును సాగు చేస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీలకు నష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి మూతపడిన బోధన్, మెదక్, మెట్‌పల్లిలోని నిజాం డెక్కన్‌ షుగర్స్‌ యూనిట్లు తెరుచుకుంటే చెరకు పంట సాగు విస్తీర్ణం 61వేల హెక్టార్లకు చేరాలి. అంటే ప్రస్తుతం రాష్ట్రంలోని ఫ్యాక్టరీల క్రషింగ్‌ సామర్థ్యానికి అవసరమైన విస్తీర్ణంలో కేవలం మూడో వంతు విస్తీర్ణంలో మాత్రమే చెరకు సాగవుతోంది. 

తమిళనాడు తరహాలో బోనస్‌ ఇవ్వాలి 
తమిళనాడులో చెరకు రైతులకు టన్నుకు రూ.1,000 చొప్పున బోనస్‌ ఇస్తున్నారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా చెరకు రైతులకు రూ.1,000 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు వరి సాగువైపే మొగ్గు చూపుతున్నారు.  – రచ్చ నరసింహారావు, చెన్నారం, ఖమ్మం జిల్లా

చెరకు రైతులను ఆదుకోవాలి
చెరకు సాగులో ఖర్చులు పెరిగి గిట్టుబాటు కావడం లేదు. స్థానికంగా ఉన్న చక్కెర కర్మాగారం మూతపడటంతో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు కనీస మద్దతు ధర కూడా ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. సన్న వడ్లకు ఇచ్చినట్టుగా చెరకు రైతులకు కూడా బోనస్‌ ఇవ్వాలి. చెరకు సాగులో యాంత్రీకరణ అనుకున్నంత వేగంగా జరగడం లేదు.   – ఈదులపల్లి ఈరన్న, హద్నూర్, సంగారెడ్డి జిల్లా   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)