కల్యాణలక్ష్మి డబ్బునుంచి పంట రుణం కోత

Published on Sat, 01/25/2025 - 03:47

సిరికొండ: నిరుపేద ఆడపిల్లల పెళ్లికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభు త్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తుండగా, ఈ పథకం కింద వచ్చిన డబ్బు నుంచి బ్యాంకు అధికారులు పంట రుణాన్ని జమచేసుకున్నారు. దీంతో ఓ తల్లి తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని లచ్చింపూర్‌(బీ) గ్రామానికి చెందిన గిరిజన మహిళ పెందురు సోమ్‌బాయికి ఆరుగురు కూతుళ్లు ఉన్నారు. 

రెండో కూతురుకు గత వేసవిలో వివాహం చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగా గతవారం ప్రభుత్వం ద్వారా రూ.1,00,116 చెక్కు అందుకుంది.తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ నెల 17న వోచర్‌ రాసి ఇచ్చింది. ఈ డబ్బులు డ్రా చేసుకోవడానికి శుక్రవారం బ్యాంకుకు వెళ్లింది. అయితే బ్యాంకు ఖాతాలో రూ.40 వేలు మాత్రమే జమ అయ్యాయి. 

ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను అడిగితే.. ఆమె పంట రుణం రూ.1.60 లక్షలు ఉండగా, వడ్డీ రూ.60 వేలు అయిందని, దీంతో కల్యాణలక్ష్మి డబ్బుల నుంచి వడ్డీ కింద రూ.60 వేలు జమ చేసుకున్నామని చెప్పగా, ఆమె అవాక్కయింది. తనకు వచ్చిన పూర్తి డబ్బులను ఇవ్వాలని ఎంత వేడుకు న్నా బ్యాంకు సిబ్బంది కనికరించలేదని ఆమె ఆవే దన వ్యక్తం చేసింది. పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చాలని అనుకుంటే, పంట రుణం కింద జమ చేసుకోవడం అన్యాయమని బోరుమంది. ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ నరేశ్‌కు  ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)