Breaking News

1.31 కోట్ల ఎకరాల నుంచి 2.38 కోట్ల ఎకరాలకు

Published on Sun, 06/02/2024 - 06:03

తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో 2014–15లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న పంటల సాగువిస్తీర్ణం 2022–23 నాటికి 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే పదేళ్ల కాలంలో కోటి ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. సాగు విస్తీర్ణం పెరగడంతో పంట ఉత్పత్తి కూడా అదే స్థాయిలో 1.50 కోట్ల టన్నుల నుంచి 3.62 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే పంట ఉత్పత్తి 2014తో పోలి్చతే ఏకంగా 137 శాతం పెరగడం గమనార్హం.

వరిసాగులో దేశంలో అగ్రగామిగా నిలిచింది. 2014–15లో 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు కాగా, 2022–23లో ఇది ఏకంగా 121 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే తొమ్మిదేళ్ల కాలంలో 86 లక్షల ఎకరాల్లో వరి సాగు పెంపు కారణంగా, ధాన్యం ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. 2014–15లో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, 2022–23 నాటికి ఇది 2.60 కోట్ల టన్నులకు పెరిగింది.  – సాక్షి, హైదరాబాద్‌

రూ.75 వేల కోట్లు రైతుబంధు కింద జమ  
⇒ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున రైతులకు అందించారు. ఈ పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖా­తా­లోనే జమ చేశారు. ప్రతి సీజన్‌లో సుమారు 65 లక్షల మందికి రూ.7,500 కోట్ల వరకు అందించేవారు. ఈ విధంగా ఇప్పటివరకు మొత్తం రూ. 75 వేల కో­ట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. కాంగ్రెస్‌ ప్రభు­త్వం  రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది.  

⇒ కేసీఆర్‌ రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వివిధ కారణాలతో మరణించిన సుమారు 1.15 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ. 5,566 కోట్ల పరిహారాన్ని అందించింది.  

లక్ష రుణమాఫీ
అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు రుణ విముక్తి చేయడమే లక్ష్యంగా గత ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది.  ఇందులో భాగంగానే తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. లక్ష వరకు రుణమాఫీ చేసిన కేసీఆర్‌ సర్కారు.. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రూ.లక్ష మాఫీకి హామీ ఇచ్చింది. ఇందులో 2014లో తొలిసారి 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 16,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది.

ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 23 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.13 వేల కోట్ల రుణాలను మాఫీ చేయగా, మరో రూ. 6 వేల కోట్ల రుణాల మాఫీ పెండింగ్‌లో ఉంది. ఎన్నికల కోడ్‌ రావడంతో అడ్డంకి ఏర్పడింది.  ఇప్పుడు రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దాదాపు రూ. 35 వేల కోట్లు అవసరమవుతాయని అంటున్నారు.  

Videos

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)