Breaking News

రామోజీ ఫిలింసిటీలో ఉద్రిక్తత

Published on Wed, 03/26/2025 - 14:35

సాక్షి, హైదరాబాద్‌: రామోజీ ఫిలింసిటీలో ఉద్రిక్తత నెలకొంది. రామోజీరావు ఫిలింసిటీని సీపీఎం నేతలు ముట్టడించారు. రామోజీ ఫిలింసిటీ గేట్లు దూకి సీపీఎం నేతలు లోపలికి వెళ్లారు. పేదల భూములను ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమించగా.. బాధితులతో​ కలిసి ఆక్రమిత స్థలంలో సీపీఎం నిరసన చేపట్టింది. ఈ క్రమంలో సీపీఎం నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలువురు సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తోపులాటలో మహిళ స్పృహ తప్పిపోయింది.

కాగా,  సీపీఎం ఇవాల ఛలో రామోజీ ఫిలిం సిటీకి పిలుపునిచ్చింది.. పేదలకు ఇచ్చిన భూములను రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఆక్రమించింది. ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని చెప్పి ఆర్‌ఎఫ్‌సీ యాజమాన్యం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చింది. ఏడాది కాలంగా సమస్య పరిష్కారం చేయకుండా ఆర్‌ఎఫ్‌సీ యాజమాన్యం సాగదీస్తోంది.

ఇటీవల కలెక్టరేట్ ముందు బాధితులతో కలిసి సీపీఎం ధర్నా కూడా నిర్వహించింది. ముడు దఫాలుగా ఫిలిం సిటీ యాజమాన్యంతో చర్చలు జరిపిన ఫలితం లేకపోవడంతో నేడు ఛలో ఫిలిం సిటీకి పిలుపునిచ్చింది. చర్చలు జరిపి తమకు ఇంటి  స్థలాన్ని  చూపించకపోతే ఫిలింసిటీని ముట్టడిస్తామని సీపీఎం నేతలు ముందే హెచ్చరించారు.

హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ఉద్రిక్తత

 

 

 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)