Breaking News

సీపీఎం.. మున్సి‘పల్టీ’

Published on Mon, 02/16/2026 - 05:54

సాక్షి, హైదరాబాద్‌: ఒకప్పుడు కార్మిక–రైతు ఉద్యమాలకు అగ్రగామిగా నిలిచిన సీపీఎం ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోగా, సీపీఐ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా గణనీయ విజయాలను నమోదు చేసింది. కొత్తగా అవతరించిన కొత్తగూడెం కార్పొరేషన్‌పై సీపీఐ ఎర్రజెండా ఎగురవేయనుంది. సీపీఎం మాత్రం బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని పోటీ చేసి కూడా ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో తన ప్రభావాన్ని చూపలేకపోయింది. 

బీఆర్‌ఎస్‌తో పొత్తు.. రెంటికీ నష్టం
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని సీపీఎం బరిలోకి దిగినప్పటికీ ఆ వ్యూహం ఫలించలేదు. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సీపీఎం పోటీ చేసిన చోట కాంగ్రెస్‌ విజయం సాధించింది. తద్వారా బీఆర్‌ఎస్‌ కూడా నష్టపోయినట్టు అయింది. రాష్ట్రవ్యాప్తంగా 13 వార్డుల్లో మాత్రమే సీపీఎం గెలుపొందింది. ఐదేళ్ల క్రితం ఒంటరిగా పోటీ చేసి 12 సీట్లు సాధించిన సీపీఎంకు, ఈసారి పొత్తుతో  ఒక సీటు మాత్రమే అదనంగా దక్కింది.  ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలు ఒకప్పుడు సీపీఎంకు ప్రధాన కోటలు. కానీ తాజా ఫలితాలు అక్కడ కూడా ప్రభావం తగ్గినట్టుగా చూపిస్తున్నాయి. స్థానిక నాయకత్వం బలహీనత, ఓటర్ల మూడ్‌ మార్పు, పొత్తులపై గందరగోళం.. ప్రభావితం చేసిన అంశాలుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

సీపీఐ దూకుడు.. మేయర్‌ అవకాశం
ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో సీపీఐ వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్‌లో గణనీయ ఫలితాలు సాధించింది. కొత్తగూడెంలో 22 మంది కార్పొరేటర్లు, రామగుండంలో ఒక కార్పొరేటర్‌ సీపీఐ తరఫున గెలిచారు. క్యాతనపల్లి, ఎదులాపురం మున్సిపాలిటీల్లో నాలుగేసి వార్డులు, మహబూబాబాద్‌లో 3 వార్డులతోపాటు హుజూర్‌నగర్, యాదగిరిగుట్ట, వైరా, చండూరు, కోదాడ, భూపాలపల్లిలలో ఒక్కో వార్డు గెలుచుకుంది. ఏకంగా 40 స్థానాల్లో విజయాలు నమోదు చేయడం సీపీఐకి నూతన ఉత్సాహాన్ని కలిగించింది. ముఖ్యంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో మేయర్‌ పదవిని దక్కించుకునే అవకాశాన్ని సీపీఐ పొందడం తెలంగాణ, ఉమ్మడి ఏపీ చరిత్రలోనే తొలి ఘట్టంగా నిలవనుంది.  

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)