Breaking News

‘రక్త దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడండి’

Published on Mon, 10/27/2025 - 13:24

సాక్షి, హైదరాబాద్‌: రక్తదానం చేయడం అంటే ఇతరుల ప్రాణాలను కాపాడటమే అని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రోగుల అవసరానికి తగ్గట్టుగా జనాభాలో  ఒక శాతం రక్తాన్ని దానం చేయడంలో ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు. ఒక్క యూనిట్ రక్తం ముగ్గురు ప్రాణాలు కాపాడుతుందన్నారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మెగా బ్లడ్ డొనేట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్‌ రెడ్డి, హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ పాల్గొన్నారు. అనంతరం, డీజీపీ శివధర్‌ రెడ్డి మాట్లాడుతూ..‘రక్తదానం చేయడం వల్ల పలు రకాలుగా రక్తం ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది. ప్రతీ యేటా  నాలుగు సార్లు బ్లడ్  ఇచ్చే అవకాశం ఉంటుంది.  సమాజంలో రోడ్డు ప్రమాదాలలో గాయపడే వారికి ఈ రక్తం అవసరం ఉంటుంది. రాష్ట్రంలో  ఒక ఏడాదిలో ఎనిమిది వేల మంది చనిపోయారు. వారిలో రక్తం లేక చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నారు.  రోగుల అవసరానికి తగ్గట్టుగా జనాభాలో  ఒక శాతం రక్తాన్ని దానం చెయ్యడంలో ప్రజలందరూ ముందుండాలి. రక్తదానం చేసే గొప్ప కార్యక్రమం నిర్వహించిన సీపీ సజ్జనార్‌కు అభినందనలు తెలిపారు. గతంలో కోవిడ్ సమయంలో సైబరాబాద్ సీపీగా సజ్జనార్ ప్రజలకు అందించిన సేవలను డీజీపీ కొనియాడారు.

మరోవైపు.. సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. నగరంలో అన్ని జోన్లలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. తొమ్మిది క్యాంపుల ద్వారా 3,500 యూనిట్స్ టార్గెట్ పెట్టుకొని శిబిరాలు ఏర్పాటు చేశాం. పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు. రక్తం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలు సామాజిక బాధ్యతగా  ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు, ఎమర్జెన్సీలో ఆపరేషన్‌లో రక్తం అవసరం ఉంటుందన్నారు. తలసేమియా వ్యాధితో చాలామంది బాధ పడుతున్నారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన బ్లడ్ యూనిట్స్‌ను వాళ్లకు అందజేస్తామని తెలిపారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)