నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
హైదరాబాద్ వాసులారా అప్రమత్తం!
Published on Mon, 08/03/2026 - 15:44
హైదరాబాద్: నగరంలో ఈ రోజు రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీపీ వీసీ సజ్జనార్ సూచించారు.
‘అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దు. ఇళ్ల నుంచి బయటకు రావద్దు. బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగే లోపే పనులను త్వరగా ముగించుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలి. ముఖ్యంగా నీరు నిలిచిన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయడం అస్సలు సురక్షితం కాదు.
వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలి’ అని తన సోషల్ మీడియా ఖాతా ’ఎక్స్’లో ట్వీట్ చేశారు.
హైదరాబాద్ వాసులారా అప్రమత్తం!
నగరంలో ఈ రోజు రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దు. ఇళ్ల నుంచి బయటకు రావద్దు. బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగే… https://t.co/X9moh2KVx3— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 3, 2026
Tags : 1