Breaking News

ఆన్‌లైన్‌ వేధింపులపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు

Published on Tue, 11/18/2025 - 19:47

మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్‌లో వస్తున్న బెదిరింపులు, దుర్భాషలపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్‌ వి.సి. సజ్జనార్ హామీ ఇచ్చారు. స్వతంత్ర జర్నలిస్టు తులసి చందు సహా పలువురు మహిళా జర్నలిస్టులు మంగళవారం కమిషనర్‌కు రాతపూర్వకంగా  ఫిర్యాదు సమర్పించారు. తమపై జరుగుతున్న నిరంతర ట్రోలింగ్‌, వేధింపులు, బెదిరింపులు, అసభ్య దాడులకు సంబంధించిన వివరాలను వారు అందించారు.

సోషల్‌మీడియాలో నిరంతరం విద్వేష వ్యాఖ్యలు,అసభ్య పోస్టులు, దాడులు, హత్యా బెదిరింపులకు పాల్పడుతున్న వైనంపై మహిళా జర్నలిస్టుల ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. ఈ వేధింపుల నియంత్రణకు కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు  తీసుకోవాలని సజ్జనార్‌కు విజ్ఞప్తి చేశారు. ట్రోలింగ్‌కు సంబంధించిన వీడియోలను ఆయన పరిశీలించారు.తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు అందుబాటులో ఉన్న లింకులు, స్క్రీన్‌షాట్లు, వీడియోలను తన కార్యాలయానికి ఇవ్వాలని  సజ్జనార్  కోరారు.

 కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద

ఆన్‌లైన్‌ వేధింపులపై పోరాటంలో భాగంగా  మహిళా జర్నలిస్టుల ప్రతినిధి బృందం మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.  దీనిపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా స్పందిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో బెదిరింపులు, అసభ్యకర పోస్టులు, దుర్భాషలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వీటిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామన్నారు. 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)