Breaking News

కోవిడ్‌ దెబ్బకు సిరిసిల్ల విలవిల!

Published on Wed, 06/18/2025 - 09:10

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: ప్రపంచదేశాలను గడగడలాడించిన కోవిడ్‌ మహమ్మారి మిగిల్చిన విషాదాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నిలువుదోపిడీ చేసి వేలాది మందిని బలితీసుకున్న ఆ వైరస్‌ వదలిన ఆనవాళ్లు ఇప్పట్లో చెరిగేలా లేవు. తాజాగా  ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన పాపులేషన్‌ రిపోర్ట్‌ సమర్పించిన ‘సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌’ (సీఆర్‌ఎస్‌) డేటా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. దేశంలో జననాల కన్నా అత్యధిక మరణాలు చోటు చేసుకున్న 49 జిల్లాల్లో సిరిసిల్ల జిల్లా కూడా ఒకటి. కోవిడ్‌ అనంతరం ప్రజల ఆరోగ్యాలు, జీవనశైలిలో మార్పులు రావడం, సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా విజృంభించడంతో ఆ ఏడాది మరణాలు అధికంగా సంభవించాయి.

సీఆర్‌ఎస్‌ డేటా ప్రకారం..
2021లో నమోదైన జనన మరణాలను పరిశీలి స్తే, 5,130 మరణాలకు 5,028 జననాలు చోటు చేసుకున్నాయి. ఆ మరణాలు కేవలం సిరిసిల్ల జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,34,425 మరణాలు రికార్డయ్యాయి. అందులో 1,35,725 మంది పురుషులు, 98,700 మంది మహిళలు ఉన్నారు. ఈ గణాంకాల ప్రకారం.. మహిళల కన్నా పురుషులు 40శాతం అధికంగా మరణించారు. ఆ ఏడాది చోటు చేసుకున్న మరణాల్లో పట్టణ ప్రాంతాల్లో 61,553 పురుషులు, 46,674 మంది మహిళలు మరణించగా.. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో 1,06,327 మరణాలు సంభవించాయి.

పురుషుల్లోనే మరణాలు అధికం
డేటా ప్రకారం 65 నుంచి 69 ఏళ్ల వయసు వారి లో మరణాల రేటు అధికంగా ఉంది. ఈ వయసులో ఉన్న వారిలో 85,945 మరణాలు రికార్డయ్యాయి. ఇక 70 ఏళ్ల పైబడిన వారిలో 51,516 మరణాలు నమోదయ్యాయి. 55 నుంచి 64 ఏళ్ల 42,349 మంది మరణాలు, 45– 54 వయసు గ్రూపులో 12,184 మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ స్థాయిలో మరణాలు చోటు చేసుకోవడానికి కోవిడ్‌ ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో జీవన విధానంలో మార్పులు, బీపీ, హైపర్‌ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు కూడా వీరి మరణాలకు కారణమై ఉంటాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ మరణాల రికార్డులో ముందంజలో ఉంది. 75›శాతం మేరకు మరణాలు అప్పటికప్పుడే రిపోర్టు అవుతున్నాయి. మిగిలినవి తరువాత రిపోర్టు అవుతున్నాయి. సీఆర్‌ఎస్‌ డేటా ప్రకారం.. 2022లో రాజన్న సిరిసిల్లలో 3,220 మరణాలు నమోదవగా, 7647 జననాలు నమోదయ్యాయి. ఏడాది తరువాత కోవిడ్‌ ప్రభావం తగ్గిపోవడంతో మరణాలు కూడా తగ్గుముఖం పట్టి ఉంటాయని భావిస్తున్నారు. 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు