Breaking News

అప్పులిచ్చినవారి వేధింపులు భరించలేక..

Published on Mon, 12/22/2025 - 07:47

బెజ్జంకి (సిద్దిపేట): అప్పులిచ్చిన వారి వేధింపులు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్, రేణుకలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీహర్ష (33)కు మూడేళ్ల క్రితం రుక్మిణి (28)తో వివాహం జరిగింది. బెజ్జంకిలో వస్త్ర దుకాణం పెట్టుకుని అక్కడే జీవిస్తున్నారు. 

వీరికి కూతురు హరిప్రియ ఉంది. కాగా శ్రీహర్ష తన మిత్రుడి వద్ద డబ్బులు తీసుకుని, మరో మిత్రునికి ఇచ్చాడు. డబ్బులివ్వాలని అప్పుచి్చన వ్యక్తి మరో ముగ్గురితో కలిసి వేధిస్తుండగా, తీసుకున్న వ్యక్తి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో వారి వేధింపులతో అవమానంగా భావించిన శ్రీహర్ష, భార్య, కూతురుతో కలిసి క్రిమిసంహారక మందు తాగారు. చిన్నారి రోదన విని సమీప వ్యక్తులు శ్రీహర్ష తండ్రికి సమాచారమందించారు.

 అతను వచ్చి ఇంటి తలుపులు తెరిచి వెళ్లేసరికి అప్పటికే రుక్మిణి మృతి చెందింది. శ్రీహర్ష, చిన్నారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీహర్షను కరీంనగర్‌ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా చిన్నారి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తమ చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రవీందర్‌రెడ్డి, రూరల్‌ సీఐ శ్రీను, ఎస్‌ఐ సౌజన్య పరిశీలించారు.   

 

 

 

 

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)