Breaking News

పత్తిపై తేమ, ధరల కత్తి

Published on Sat, 10/26/2024 - 04:40

ఆదిలాబాద్‌ టౌన్‌:  ఆదిలాబాద్‌ మార్కెట్లో పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన నెలకొంది. తేమ శాతం, తక్కువ ధర ఖరారుపై వివాదం ఏర్పడటంతో కొనుగోళ్లు జరగలేదు. తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనాలంటూ రైతులు రాత్రివరకు తమ ఆందోళన కొనసాగించారు. వివరాలిలా ఉన్నాయి.. సీసీఐతో పాటు ప్రైవేట్‌ వ్యాపారులు పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు శుక్రవారం ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డుకు చేరుకున్నారు. సీసీఐ క్వింటాల్‌ పత్తికి మద్దతు ధర రూ.7,521తో కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ప్రైవేట్‌ వ్యాపారులు మొదట క్వింటాల్‌ పత్తికి రూ.6,700 ధర వేలం ద్వారా నిర్ణయించి, ఆ తర్వాత రూ.10, రూ.20 పెంచుతూ రూ.7,150 వరకు చేరుకున్నారు.

ఆ తర్వాత ధర పెంచేందుకు ససేమిరా అన్నారు. దీంతో కలెక్టర్‌ రాజర్షిషా, మార్కెట్‌ అధికారులు ధర పెంచాలని ప్రైవేట్‌ వ్యాపారులకు సూచించినప్పటికీ వారు ఒప్పుకోలేదు. దీంతో ప్రతిష్టంభన నెలకొంది. సీసీఐతో పోలి్చతే ప్రైవేట్‌ ధర తక్కువగా ఉండడంతో రైతులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్‌ వారికి నచ్చజెప్పినప్పటికీ వినకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో కలెక్టర్‌ సీసీఐ, ప్రైవేట్‌ వ్యాపారులతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు.

ప్రైవేట్‌ వ్యాపారులు రూ.7,200కు కొనుగోలు చేసేందుకు ఒప్పించారు. మరోవైపు సీసీఐ అధికారులు కూడా నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తామని తెలిపారు. 8 నుంచి 12 మధ్య శాతం తేమ ఉంటేనే పత్తిని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అది దాటితే క్వింటాలుకు రూ.75.21 చొప్పున కోత విధిస్తామని పేర్కొనడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తేమతో సంబంధం లేకుండా సీసీఐ పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. వారికి బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ మద్దతు తెలిపారు. 

కలెక్టర్‌ ఘెరావ్‌..ఉద్రిక్తత 
    ప్రైవేట్‌ వ్యాపారులు, సీసీఐ అధికారులు, రైతులతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కలెక్టర్‌ పలుమార్లు చర్చించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటాల్‌ రూ.7,200కు కొనుగోలు చేసేలా ఒప్పించిన తర్వాత వాహనంలో వెళ్లేందుకు ప్రయత్నించగా రైతులు ఘెరావ్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మొత్తం మీద రాత్రి వరకు తేమ పేచీ తేలలేదు. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి పంటను కొనుగోలు చేయాలని రైతులు పట్టుబట్టారు. కానీ నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు చెప్పడం, ధర పెంచేందుకు ప్రైవేట్‌ వ్యాపారులు ఒప్పుకోక పోవడంతో రైతులు ఆందోళనకు దిగారు.

దీంతో కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ గౌస్‌ ఆలం, అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, మార్కెటింగ్‌ అధికారులు మరోసారి సీసీఐ అధికారులు, ప్రైవేట్‌ వ్యాపారులతో చర్చించినా ఎటూ తేలలేదు. కోపోద్రిక్తులైన రైతులు మార్కెట్‌ యార్డు నుంచి పంజాబ్‌ చౌక్‌ చేరుకొని రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళనను కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. రాత్రి వరకు ప్రైవేట్‌ వ్యాపారులతో చర్చలు జరిపిన జిల్లా కలెక్టర్‌.. చివరకు మొదటి రోజు తీసుకొచ్చిన పత్తిని తేమతో సంబంధం లేకుండా క్వింటాల్‌ రూ.6,696 చొప్పున శనివారం కొనుగోలు చేసేలా వ్యాపారులను ఒప్పించారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)