Breaking News

రూపాయికే కార్పొరేట్‌ వైద్యం.. డాక్టర్‌ హర్షవర్ధన్‌ గొప్ప మనసు

Published on Thu, 04/13/2023 - 03:53

ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నాననే భావనతో..
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన హర్షవర్ధన్‌ ఎంబీబీఎస్, ఎంఎస్‌ ఆర్థోపెడిక్‌ ఖమ్మంలో పూర్తి చేశారు. కొంతకాలం ఖమ్మంలో పనిచేసిన ఆయన తరువాత ఇల్లెందులో సొంత క్లినిక్‌ పెట్టారు. ఈలోగా ఇల్లెందు వైద్యశాలను వైద్య విధాన పరిషత్‌లోకి మార్చుతూ అప్‌గ్రేడ్‌ చేశారు. హర్షవర్ధన్‌కు ఆ ఆస్పత్రిలో సర్జన్‌గా ఉద్యోగం వచ్చింది. ఆయన సతీమణి తేజస్వి కూడా ఆ ఆస్పత్రిలో ఈఎన్‌టీ విభాగంలో డాక్టర్‌గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం... ఖాళీ సమ­యంలో ప్రైవేట్‌ ఆస్పత్రి. సంపాదన బాగానే ఉన్నా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామనే అంతర్మథనం మొదలైంది. 

పుచ్చలపల్లి సోదరుడే స్ఫూర్తి..
నెల్లూరులో పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు డాక్టర్‌ పి.రామచంద్రారెడ్డి పీపుల్స్‌ పాలీ క్లినిక్‌ పేరిట రూ.10 ఫీజుతో వైద్యం అందించేవారు. నెల్లూరుకే చెందిన హర్షవర్ధన్‌... రామచంద్రారెడ్డి స్ఫూర్తితో ఏదైనా చేయాలనుకున్నారు. ఇల్లెందు ఆంబజార్‌లో పెట్టిన సొంత క్లినిక్‌లో రూపాయి ఫీజుకే వైద్యం అందించడం ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు పూర్తయ్యాక, సాయంత్రం క్లినిక్‌లో సేవలందిస్తు­న్నా­రు.

ఆపరేషన్లు తప్పనిసరి అనుకున్నవారికి ఆరోగ్య­శ్రీ ద్వారా ఖమ్మంలో శస్త్రచికిత్స కూడా చేస్తున్నారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు 35 మందికి ఆపరేషన్లు చేశారు. ఇందులో మోకాలు, తుంటి, కీళ్ల మార్పిడి వంటి ఆపరేషన్లు.. మోకాళ్లు, అరికాళ్ల నొప్పు­లు, నడుము, మెడనొప్పి, కాళ్ల తిమ్మిర్లు వంటి అనేక సమస్యలకు అత్యాధునిక పద్ధతిలో వైద్యమందించారు.

మోకాలు చిప్ప మార్పిడి చేశారు.. 
నడవడం ఇబ్బందిగా ఉండడంతో ఓ డాక్టర్‌ వద్ద పరీక్ష చేయించుకున్నా. మోకాలు చిప్ప అరిగిపోయిందని, మార్చాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో ఇల్లెందులో ప్రజా వైద్యం అందిస్తున్న హర్షవర్ధన్‌ను సంప్రదించాను. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మోకాలి మార్పిడి ఆపరేషన్‌ చేశారు. ఇప్పుడు హాయిగా నడవగలుగుతున్నా.
– వి.బాయమ్మ, మామిడిగూడెం, ఇల్లెందు మండలం

పేదలను ఆదుకోవాలని..డాక్టర్‌ జి.హర్షవర్ధన్, ఆర్థోపెడిక్‌ సర్జన్‌
ప్రస్తుత వైద్యం అత్యంత ఖరీదైంది. సామాన్యులను అందకుండాపోతోంది. అందుకే వారిని ఆదుకునేందుకు రూపాయి ఫీజుతో వైద్యం చేస్తున్నా. ప్రభుత్వ వైద్యులుగా నాకు, నా భార్యకు వచ్చే వేతనం మా కుటుంబానికి సరిపోతుంది. అందుకే క్లినిక్‌లో నామమాత్ర ఫీజుతో వైద్యం చేస్తున్నా. 

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)