Breaking News

‘నా భార్యను అంతలా చూస్తున్నారు.. చంపేస్తా’

Published on Thu, 12/19/2024 - 10:05

మహబూబ్‌నగర్: బిహార్‌ తాపీ కూలీ దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్యను చూస్తున్నాడనే కారణంతో భర్త.. ఓ యువకుడిపై దాడికి పాల్పడి మరో యువకుడిని ఐరన్‌రాడ్‌తో తలపై మోది దారుణంగా హత్య చేశాడు. ఈఘటన మంగళవారం అర్ధరాత్రి వరంగల్‌ కరీమాబాద్‌ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి సోదరుడి కథనం ప్రకారం.. బిహార్‌లోని ఖగారీయా జిల్లా పస్రహ తా నా మండలం జంజారా గ్రామానికి చెందిన ముని దూల్‌చంద్రకుమార్‌ రెండేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వరంగల్‌ కరీమాబాద్‌ ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు వచ్చారు. ఇక్కడ అద్దెకుంటూతాపీ మేస్త్రి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం చంద్రకుమార్‌ తమ్ముడు ముని దిల్‌ఖుషికుమార్‌(16), మరో యువకుడు పవన్‌ కూడా వరంగల్‌ రాగా ముగ్గురు కలిసి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. 

పనిచేసే చోట వీరికి ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో అద్దెకుంటున్న బానోత్‌ నగేశ్‌ పరిచయమయ్యాడు. ఇటీవల నగేశ్‌ అత్తామామలు చంద్రకుమార్‌ ఉండే ఇంట్లో ఓ రూమ్‌లో అద్దెకు దిగారు. నగేశ్‌ భార్య తన పిల్లలను తీసుకుని తరచూ పుట్టింటికి వచ్చేది. ఈ క్రమంలో ఇటీవల నగేశ్‌ తన భార్యను చూస్తున్నారని అనుమానంతో చంద్రకుమార్‌, దిల్‌ఖుషికుమార్‌ వద్దకు వచ్చి ‘నా భార్యను అంతలా చూస్తున్నారు.. చంపేస్తా’ అంటూ బెదిరించి వెళ్లిపోయాడు. మంగళవారం రాత్రి దిల్‌ఖుషి కుమార్‌ రూమ్‌కు వెళ్లగా చంద్రకుమార్‌ తన స్నేహితులు గుల్షాన్‌, బాదిల్‌తో కలిసి చిన్న బ్రిడ్జి ఏరియాలోని మేఘనా బార్‌కు వెళ్లారు. ఈ క్రమంలో నగేశ్‌, అతడి బావమరుదులు అశోక్‌, బన్నీ ద్విచక్రవాహనంపై అక్కడి చేరుకుని చంద్రకుమార్‌ను చితకబాది చంపేందుకు యత్నిస్తుండగా తప్పించుకున్నాడు. రాత్రి 12గంటలకు వరకు బయటే ఉండి అనంతరం భయపడుకుంటూ రూమ్‌కు వెళ్లగా తమ్ముడు ముని దిల్‌ఖుషికుమార్‌ రక్తమడుగులో చనిపోయి ఉన్నాడు. 

దీంతో నగేశ్‌ తన భార్యపై అనుమానంతో తనను చంపడానికి యత్నించగా తప్పించుకున్నానని, తమ్ముడు ముని దిల్‌ఖుషికుమార్‌ను కిరాయికి ఉన్న ఇంట్లోనే హత్య చేశాడని చంద్రకుమార్‌ మిల్స్‌కాలనీ పీఎస్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఏసీపీ నంది రామ్‌నాయక్‌.. ఇన్‌స్పెక్టర్‌ వెంకట రత్నం, సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలిని సందర్శించారు. మృతదేహాన్ని పరిశీ లించి హత్యకు గల కారణాలను స్థానికుల నుంచి సేకరించారు. మృతుడి సోదరుడు చంద్రకుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకటరత్నం తెలిపారు.

నేరస్తుల కోసం గాలింపు: ఏసీపీ
భార్యపై అనుమానమే ఈ హత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నామని ఏసీపీ నందిరామ్‌నాయక్‌ స్పష్టం చేశారు. నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని తెలిపారు. అయితే నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం పరారీలో ఉన్నారని చెబుతుండడం గమనార్హం.

ఇన్‌స్టాతో పాపులర్‌.. ఫోక్‌ సింగర్‌ 'శృతి' ఆత్మహత్య


 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)