Breaking News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఏడాది చివర్లోనే!

Published on Sat, 04/13/2024 - 06:05

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుకు ప్రారంభమైనా.. వాటి నిర్మాణం మాత్రం ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇళ్ల నిర్మాణం కోసం కనీసం మరో ఐదు నెలల పాటు వారు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నా యి. ఆరు గ్యారంటీల్లో ఒకటిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చి 11న అట్టహాసంగా ప్రారంభించింది. భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించగా పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లో నే పథకాన్ని ప్రారంభించినట్టు మంత్రులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి పథకాలను లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వటమో, తొలి విడత ఆర్థిక సాయం కింద చెక్కు జారీ చేయడంతోనో ప్రారంభిస్తారు. కానీ ఇందిర మ్మ ఇళ్ల పథకాన్ని కేవలం ప్రారంభిస్తున్నట్టు పేర్కొ నటమే తప్ప ఇలాంటివేవీ లేకుండా, లబ్ధిదారుల ప్రస్తావనే లేకుండా సాగింది. వాస్తవానికి ఇప్పటివరకు లబ్ధిదారులను గుర్తించనేలేదు. 

దరఖాస్తులు స్వీకరించినా..
ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్‌ నెలలోనే ప్రజా పాలన పేరుతో పేదల నుంచి వివిధ పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించింది. వీటిల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. 80 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, వాటిల్లో గతంలోనే ఇందిరమ్మ ఇళ్లను పొందిన దాదాపు 14 లక్షల మందికి సంబంధించిన దరఖాస్తులు కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. వెరసి 66 లక్షల దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చినట్టుగా రికార్డు చేశారు.

వాటిని స్క్రూటినీ చేసి ఇతర కారణాలతో అనర్హమైనవి ఉంటే తొలగించాల్సి ఉంది. ఆ తర్వాత అసలు దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని అప్పట్లో నిర్వహించకుండా పెండింగులో పెట్టారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హడావుడిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు రోజులకే కోడ్‌ అమల్లోకి రావటంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. కోడ్‌ ముగిసినా.. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)