కష్టాల 'వంతే'నా! మహా నగరంలో ఫ్లై‘ఓవర్‌ లుక్‌'

Published on Fri, 07/10/2026 - 11:40

సాక్షి, హైదరాబాద్‌: ఏదైనా ఓ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌లతో పాటు ప్రయాణ సమయం.. వాహన వేగం పెంచడం.. ప్రధానంగా ఈ ఉద్దేశాలతోనే ఫ్లైఓవర్‌ నిర్మిస్తారు. ప్రస్తుతం నగరంలోని అనేక పైవంతెనలు కొత్త సమస్యల్ని సృష్టిస్తున్నాయి. మరికొన్నింటి వద్ద ఆద్యంతాల్లో తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌లకు కారణమవుతున్నాయి. పక్కా ప్రణాళికలు లేకుండా నిర్మించడమే ప్రధాన హేతువు. ప్రస్తుతం రాజధాని నగరంలో కొన్ని ఫ్లైఓవర్ల నిర్మాణాలు జరుగుతుండగా... మరికొన్నింటి ప్రతిపాదనలు వివిధ స్థాయుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా ముందుకెళ్లాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.  

మార్పునకు నోచుకోని తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌ డిజైన్‌..
సిటీ నడి»ొడ్డున 1.1 కి.మీ పొడవుతో నిర్మాతమైన నాటి తెలుగుతల్లి, నేటి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌ది మరో క«థ. ఇక్బాల్‌ మీనార్‌– కట్టమైసమ్మ దేవాలయం మధ్య నిర్మించిన దీని డిజైన్‌నూ మార్చాలని అప్పట్లోనే అనేక మంది  నిపుణులు సూచించారు. ప్రస్తుతం ఉన్న మార్గంలో కంటే ఇటు ఇక్బాల్‌ మీనార్‌... అటు లిబర్టీ జంక్షన్లను దాటేలా డిజైన్‌లో మార్పులు చేస్తే ఫలితాలుంటాయన్నా.. ఎవరూ పట్టించుకోలేదు.  


కొత్తవాటిది మరో కథ..
ఇవన్నీ ఏళ్ల క్రితం నిర్మించిన ఫ్లైఓవర్లు. గడిచిన 10–12 ఏళ్ల కాలంలో నిర్మితమైన వాటిలోనూ అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్రధానంగా నాయిని నరసింహారెడ్డి స్టీల్‌ బ్రిడ్జ్, షేక్‌పేట్‌ ఫ్లైఓవర్, ఏఎంబీ మాల్‌ ఫ్లైఓవర్‌లతో పాటు కేబుల్‌ బ్రిడ్జికి అనుసంధానించిన రోడ్‌ నెం.45 ఫ్లైఓవర్లు ట్రాఫిక్‌ జామ్‌కు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. వీటికి అటో/ఇటో ఉన్న ఇంజినీరింగ్‌ లోపాల కారణంగా ఆయా చోట్ల భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. ఫలితంగా అప్పటి వరకు వేగంగా వచ్చిన వాహన చోదకులు మొదట, చివర చిక్కుకుపోతున్నారు.

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)