Breaking News

సంధ్య థియేటర్‌ ఘటన.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర

Published on Wed, 12/25/2024 - 14:27

పుష్ప 2 సినిమా విడుద‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య ధియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట ఘ‌ట‌న‌, త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో హైకోర్టు సీనియర్‌ న్యాయవాది పాదూరి శ్రీనివాస్‌రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వాన్నిఅస్థిర‌ప‌రిచి కూల్చేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌: సంధ్య థియేటర్‌ ఘటనను ఆసరాగా తీసుకుని తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని హైకోర్టు సీనియర్‌ న్యాయవాది పాదూరి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, హరీశ్‌రావు, కవిత కలిసి ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) సాయంతో ఢిల్లీలో న‌రేంద్ర‌ మోదీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని పడగొట్టి గవర్నర్‌ పాలన తీసుకువద్దామని చూస్తున్నారని ఆయన అన్నారు.

మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాయని, రాబోయే 48 గంటల్లో ఏదో అల్లకల్లోలం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారం లేకపోతే కేసీఆర్‌ ఫ్యామిలీ ఉండలేదని, ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ (KCR) మౌనంగా లేరని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు స్కెచ్‌ వేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ చీక‌టి కోణాల‌ను త్వ‌ర‌లో బ‌య‌ట‌పెడ‌తామ‌ని ప్ర‌క‌టించారు. న్యాయం వైపు ఉంటేనే ఈ రెండు పార్టీల‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్నారు. సినిమా వాళ్లు రాజ‌కీయాల్లో వేలుప‌డితే చూస్తూ ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించారు.

 

సినీ పరిశ్రమను బోనులో పెట్టే ప్రయత్నం: ఈటల 
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొత్తం సినీ పరిశ్రమను బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను మంగళవారం ఆయన కిమ్స్‌ ఆస్పత్రిలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఘటనను సీఎం రేవంత్‌రెడ్డి వివాదంగా చేస్తున్నట్లుందని ఆరోపించారు. హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun) కావాలనే పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి స్టేషన్‌లో కూర్చోబెట్టడం మంచిది కాదని హితవు పలికారు.

రాజకీయం చేయడం తగదు: డీకే అరుణ 
సంధ్య థియేటర్‌ ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని.. లేకుంటే దీన్ని సినీపరిశ్రమపై ప్రభుత్వ వేధింపులుగా భావించాల్సి వస్తుందని ఎంపీ డీకే అరుణ (DK Aruna) వ్యాఖ్యానించారు. మంగళవారం శ్రీతేజను పరామర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బాలుడి కుటుంబాన్ని ఆదుకొనే బాధ్యత సీని పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కాగా, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సైతం బాలుడిని పరామర్శించారు. 

చ‌ద‌వండి: సంధ్య థియేటర్‌ పరిణామాలు.. సంక్షోభం సినీ రంగానికా? రాజకీయానికా?

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)