Breaking News

కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడమే వరంగా మారింది..!

Published on Tue, 12/16/2025 - 12:16

నల్గొండ జిల్లా: నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అయితగోని మధు గౌడ్ కాంగ్రెస్ పార్టీ రెబల్‌ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే కాంగ్రెస్ రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి, 439 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతూ యువ నాయకుడిగా తన సత్తాను చాటుకున్నారు.

కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ గ్రామాభివృద్ధి, ప్రజాసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న మధు గౌడ్‌కు ఈ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించారు. దీంతో ప్రజల కోరిక మేరకు రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయన, ఇంటింటి ప్రచారం చేస్తూ గ్రామస్తుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.

యువత, మహిళలు, పెద్ద సంఖ్యలో మధు గౌడ్‌కు మద్దతుగా నిలిచారు. పారదర్శక పాలన, గ్రామ అభివృద్ధి,  తన ప్రధాన అజెండాగా ముందుకు వెళ్లిన ఆయనకు ప్రజలు ఘన విజయాన్ని అందించారు.

ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లి గ్రామ ఉపసర్పంచిగా కందుకూరి నవీన్ ఎన్నికయ్యారు. నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌ల విజయంతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. యువ నాయకుడి విజయం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)