Breaking News

నెక్ట్స్‌ ఇక తెలంగాణే

Published on Wed, 08/05/2026 - 05:13

సాక్షి, హైదరాబాద్‌: పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఇక తెలంగాణపై దృష్టి పెట్టనుందనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితులను చక్కదిద్దడంలో భాగంగా అధికార మార్పిడి, మంత్రివర్గ విస్తరణ ప్రక్రియలు హైకమాండ్‌ చేపట్టింది. కర్ణాటకలో దశల వారీగా ఈ కార్యక్రమం పూర్తి చేసింది. ఇక రాష్ట్రం వంతే అనే అభిప్రాయం పార్టీవర్గాలు, ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాజకీయ వ్యవహారాలపై కాంగ్రెస్‌ పెద్దలు దృష్టి పెడతారని, అందులో భాగంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణ ఫైలుకు ఈ నెలలో కదలిక వస్తుందని అంటున్నారు. అధిష్టానం నుంచి ఏ క్షణమైనా కబురు రావచ్చని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. 

కేబినెట్‌ బెర్తుపై ఎమ్మెల్యేల ఆశలు
ఈ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. విస్త­రణ­కు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే ఈ దఫాలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖల మార్పునకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కావడం, పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్‌ బెర్తుపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఎన్నికల మంత్రివర్గం కూర్పుపై అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తు చేయనుంది. అయితే ఇటీవలæ పార్టీ ముఖ్య నేతలు, టీపీ­సీసీ సమన్వయ కమిటీతో అధిష్టానం భేటీ అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణ అంశం చర్చ­కు రాలేదు. కానీ కర్ణాటక ఎపిసోడ్‌ పూర్త­యిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులు సద్దు­మణి­గిన వెంటనే తెలంగాణపై హైకమాండ్‌ దృష్టి పెడుతుందని అంటున్నారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)