Breaking News

స్థానిక పోరుపై కాంగ్రెస్‌ ఫోకస్‌

Published on Sat, 11/09/2024 - 02:17

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణను ప్రారంభించింది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి పి. విశ్వనాథన్‌ ఈ సమావేశాలకు స్వయంగా హాజరవుతారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.

ఈ నెల 10న ఆదిలాబాద్, బోథ్, 11న ఆసిఫాబాద్, సిర్పూర్, 12న చెన్నూరు, బెల్లంపల్లి, 13న మంచిర్యాల, ఖానాపూర్, 14న నిర్మల్, ముథోల్‌లో సమావేశాలు జరగనున్నాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రితో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఏఐసీసీ, పీసీసీ, డీసీసీ సభ్యులు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, పీసీసీ ప్రతినిధులు, బ్లాక్, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు ఈ సమావేశాలకు విధిగా హా జరు కావాలని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు టి. కుమార్‌రావు ఉత్తర్వులు జారీచేశారు. 

కులగణన తీరుపై సమీక్ష 
ఈ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహాలను రూపొందించటంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో కులగణన జరుగుతున్న తీరును కూడా సమీక్షిస్తారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన కార్యక్రమం తెలంగాణలో ప్రారంభమైనందున దీని ఆధారంగానే ముందుకు వెళ్లాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో కులగణన విషయంలో పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే కోణంలో ఈ సమావేశాల్లో కులగణన అంశాన్ని కూడా చేర్చినట్టు తెలుస్తోంది.  

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)