Breaking News

మూడు రంగులతో కాంగ్రెస్ మార్క్ రాజముద్ర

Published on Thu, 05/30/2024 - 12:03

సాక్షి, హైదరాబాద్‌: అధికారంలో ఉండటంతో కాంగ్రెస్‌ తమ మార్క్‌ రాజ ముద్ర వేసుకునేందుకు సిద్ధమవుతోంది. అధికారిక గేయం ఎంపిక.. అధికారిక చిహ్నానికి మార్పులపై కసరత్తు చేస్తోంది. పలు రకాలు లోగోలు డిజైన్‌ చేయగా, రాజముద్రలో మూడు సింహాల జాతీయ చిహ్నం, వ్యవసాయం, తెలంగాణ వీరుల స్తూపానికి చోటు లభించినట్లు సమాచారం. ఆవిర్భావ దినోత్సవం రోజున లోగా ఆవిష్కరించనున్నారు. లోగో ఖారారుపై సీనియర్‌ నేతలతో సీఎం రేవంత్‌ చర్చిస్తున్నారు.. పార్టీ నేతలతో భేటీ తర్వాత ఇవాళ రాష్ట్ర చిహ్నాన్ని ఖారారు చేసే అవకాశం ఉంది.

కాగా, దశాబ్ది ఉత్సవాల క్రమంలోనే.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాచరిక ఆనవాళ్లు లేకుండా చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను అధికారిక లోగో నుంచి తొలగించే ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్‌ తీవ్రంగా విరుచుకుపడుతోంది.

తెలంగాణలో మార్పు కావాలని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ చెప్పిందని.. అధికారిక చిహ్నాలను మార్చడమే మీరు తెచ్చే మార్పా అని నిలదీస్తోంది. అయితే ఈ అంశాలపై బీజేపీ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. దశాబ్ది వేడుకలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. కానీ దశాబ్ది వేడుకలకు సోనియాగాం«దీని ఏ హోదా ఉందని పిలుస్తారంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)