Breaking News

ఎమ్మెల్సీలుగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ ఏకగ్రీవం

Published on Mon, 01/22/2024 - 16:56

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌కు ఉపసంహరణ గడువు నేటితో(మంగళవారం) ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు రెండు నామినేషన్‌లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఎన్నికలు లేకుండానే కాంగ్రెస్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఎమ్మెల్సీ సర్టిఫికెట్లను మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ అందుకోనున్నారు.  

మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు కావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు. మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ గెలుపుకోసం కృషి చేశాడని గుర్తు చేశారు. బల్మూరి వెంకట్ చేసిన ఉద్యమాలను పార్టీ గుర్తించిందని అన్నారు. పని చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉంటుందని తెలిపారు.

తన సేవలు గుర్తించి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా పనిచేస్తే పదవులు వస్తాయని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం శాసన మండలిలో తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. అతి చిన్న వయసులో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు తెలిపారు బల్మూరి వెంకట్‌. 9 సంవత్సరాలు తనతో పాటు ప్రతి ఉద్యమంలో పాల్గొన్న ఎన్‌ఎస్‌యూఐ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. విద్యార్థి, నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా ఉంటానని అన్నారు.

చదవండి: మంత్రి పొన్నంకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)