Breaking News

సినిమాల్లోకి ఎంట్రీ.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Sun, 03/16/2025 - 16:05

సాక్షి, హైదరాబాద్‌: గత మూడు నెలల క్రితం డైరెక్టర్ రామానుజం తనకు చూపిన ఫోటో చూసి కనెక్ట్ అయ్యానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 2013 నుంచి తనలాంటి వ్యక్తి కోసం చూస్తున్నానని.. టైం ఇస్తారా అని డైరెక్టర్ అడగగానే... టైం ఇవ్వలేనేమోననుకున్నా.. కానీ ఆ తర్వాత డైరెక్టర్ చూపెట్టిన ఫోటో చూసి ఇది కచ్చితంగా చేయాలని డిసైడ్ అయ్యా’’ అని జగ్గారెడ్డి చెప్పారు.

‘‘ఏ వార్‌ ఆఫ్‌ లవ్‌’ క్యాప్షన్‌ను డైరెక్టర్ ముందే రాసుకున్నారు. నా కథకు, లవ్‌కు సంబంధం లేదు. కథ చెప్పే క్రమంలో స్టార్టింట్ అంతా డైరెక్టర్ చెప్పారు.. మిగతా అంతా నా లైఫ్‌లో జరిగిన కొన్ని విషయాలు చెప్పా. కొన్ని విషయాలలో డైరెక్టర్ కన్విన్స్ అయ్యారు. నేను సినిమాల్లోకి వెళ్లడానికి ఢిల్లీ టూర్ పనికొచ్చింది. నా రాజకీయానికి సంబంధం లేదు. నేను రాజకీయాల్లో ఉన్నా.. సినిమా ద్వారా కొత్త గా రాజకీయాల్లో అడ్వాంటేజ్ తీసుకునేదేమీలేదు’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

విద్యార్థి నేతగా, కౌన్సిలర్‌గా రోల్ ఉంటుంది. మున్సిపల్ ఛైర్మన్ ఎలా అయ్యాననేది ఇందులో చూపిస్తాం. లవ్, ఫ్యాక్షన్, ఎమోషన్ , పొలిటికల్‌గా సినిమా ఉంటుంది. ఢిల్లీ టూర్ నన్ను పూర్తి గా మార్చేసింది.. దీని పరిణామాలు ఎటు పోతాయో నాకు తెలియదు. సంగారెడ్డి అభివృద్ధిపై ఫోకస్ చేస్తూనే సినిమాపై దృష్టి పెడతా. మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ నిధులు సంగారెడ్డి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తా.. స్టేట్ పార్టీలో ఇప్పుడు నా అవసరం లేదు. ఉగాదికి నా సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. సంగారెడ్డికి చెందిన మొగిలయ్య 18 ఏళ్ల క్రితం రాసిన పాటను విడుదల చేస్తాం’’ అని జగ్గారెడ్డి తెలిపారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు