Breaking News

పదవులు అడుక్కోను.. రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published on Sun, 07/19/2026 - 07:16

సాక్షి, హైదరాబాద్‌: ‘నేను, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒకే కుటుంబం కాదు. మేమిద్దరం అన్నదమ్ములమైనా మా కుటుంబాలు వేరు. నాకు పదవులు అడుక్కోవడం తెలియదు. కొట్లాడటమే నా తత్వం’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే, కోదాడ ఎమ్మెల్యే (ఉత్తమ్, పద్మారెడ్డి) ఒక కుటుంబం అవుతారని, కానీ నా ఫ్యామిలీ నాది, వెంకట్‌రెడ్డి ఫ్యామిలీ ఆయనదని పేర్కొన్నారు. తాను రాజీనామా చేసి ఉపఎన్నికకు పోతే తన నియోజకవర్గానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారని రాజగోపాల్‌రెడ్డి గుర్తుచేశారు.

‘ఎన్నికల ముందు మంత్రి పదవులిస్తామని హామీ పొందిన వారిలో జూపల్లి, పొంగులేటి, కొండా సురేఖ, వివేక్‌ వెంకట్‌ స్వామి, తుమ్మలకు న్యాయం చేశారు. నా విషయంలోనే ఏఐసీసీ హామీ నెరవేర్చలేదు’అని మరోసారి వివరించారు. ఏఐసీసీ ఇచ్చిన మాట ప్రకారం రాజగోపాల్‌ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్‌ గాం«దీని ప్రధాని చేయడమే రాజగోపాల్‌రెడ్డి లైన్‌ అని స్పష్టంచేశారు. రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పారీ్టలో మరోసారి చర్చకు దారితీశాయి. 

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)