Breaking News

ఆరోగ్యశ్రీ సేవలపై గందరగోళం

Published on Tue, 09/16/2025 - 01:37

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలపై గందరగోళం నెలకొంది. బకాయిలు చెల్లించని కారణంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి సేవలను నిలిపివేస్తున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన తర్వాత సోమ వారం ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. 

కొన్ని యాజమాన్యాలు బంద్‌ కొనసాగించాలని భావిస్తుండగా, ప్రభుత్వంతో గొడవ ఎందుకు అనే ధోరణిలో మరికొన్ని యాజమాన్యాలు ఉన్నట్లు సమాచారం. అయితే అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రాకేష్‌ మాత్రం మంగళవారం అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తామని తెలిపారు.  

రూ.100 కోట్లు ఇస్తే ఎలా?: ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్‌ 1 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు గత నెల 25న నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. అయితే ప్రభుత్వం పిలిపించి మాట్లాడడంతో పాటు బకాయిలు చెల్లిస్తామంటూ హామీ ఇవ్వడంతో సేవల నిలిపివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. 

అయితే నెల మొదటి వారంలో ప్రభుత్వానికి సంబంధించిన ఇతర చెల్లింపుల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల కుదర్లేదు. దీంతో హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ తాజాగా మరోసారి అల్టిమేటం ఇచ్చింది. అయితే ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయడంతో ఏం చేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. రూ.1,400 కోట్ల బకాయిలు ఉంటే రూ.100 కోట్లు ఇస్తే ఎలా అని డాక్టర్‌ రాకేష్‌ ప్రశ్నించారు.   

Videos

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!