Breaking News

పిల్లలతో అనుబంధాలు తెగిపోతున్నాయ్‌

Published on Wed, 10/23/2024 - 04:10

ఖిలా వరంగల్‌: ‘ నెలల తరబడి డ్యూటీలోనేనా.. వారానికి ఒక్కసారి ఇంటికి పంపరా.. పిల్లలతో అనుబంధాలు తెగిపోతున్నాయి’ అంటూ టీజీ పోలీసు కుటుంబ సభ్యులు మంగళవారం వరంగల్‌లోని రంగశాయిపేట గవిచర్ల క్రాస్‌ రోడ్డు జంక్షన్‌లో చంటి పిల్లలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.  ‘కొత్తగా తీసుకొచ్చే లీవ్‌ మాన్యువల్‌తో నెలకు ఒక్కసారి మాత్రమే ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబానికి దూరమై మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులకు ఒకసారి ఇచ్చే నాలుగు రోజుల పర్మిషన్‌ లీవ్‌ పాత పద్ధతినే కొనసాగించాలి’ అని ఈ సందర్భంగా పల్లవి, నవ్యశ్రీ, అంజలి తదితరులు కోరారు. 

తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌లో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 1 నుంచి కొత్తగా తీసుకొస్తున్న లీవ్‌ మాన్యువల్‌పై పోలీసు కుటుంబాలు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసింది.  ఈ నేపథ్యంలో పోలీస్‌ కుటుంబాలు ఆందోళనకు దిగుతాయని ముందస్తుగా గమనించిన పోలీసులు ఆర్టీఏ జంక్షన్, బెటాలియన్‌ ప్రధాన గేటు వద్ద భారీగా మోహరించారు. పోలీసుల అంచనాలకు అందకుండా ఇతర ప్రాంతాల్లోని పోలీస్‌ కుటుంబాలు వివిధ మార్గాల్లో రంగశాయిపేట జంక్షన్‌కు చేరుకొని రోడ్డుపై బైఠాయించాయి. 

విషయం తెలుసుకున్న ఈస్ట్‌జోన్‌ డీసీపీ రవీందర్, టీజీ ఎస్పీ కమాండెంట్‌ రాంప్రకాశ్, ఏసీపీలు నందిరాంనాయక్, తిరుపతి, సీఐలు వెంకటరత్నం, రమేష్‌లు మహిళా పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పినా పోలీసు కుటుంబాలు ససేమిరా అనడంతో వారిని వ్యానులో ఎక్కించి బెటాలియన్‌కు తరలించారు. వినతిపత్రం స్వీకరించి సాయంత్రం వదిలేశారు. ఈ కార్యక్రమంలో 200 మంది పోలీసు కుటుంబాలు పాల్గొన్నాయి. బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందిని ఉదయాన్నే స్పెషల్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆఫీసులకే పరిమితం చేశారు.  

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు