Breaking News

విధుల్లో ఉండగానే కంప్యూటర్‌ ఆపరేటర్‌ను లాక్కెళ్లే యత్నం..!

Published on Thu, 07/16/2026 - 07:58

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థలో దారుణం చోటుచేసుకొంది. తప్పతాగిన ఇద్దరు నగరపాలకసంస్థ కంప్యూటర్‌ ఆపరేటర్లు, విధుల్లో ఉన్న ఓ మహిళా కంప్యూటర్‌ ఆపరేటర్‌ను లైంగికవేధింపులకు గురిచేశారు. ఒక దశలో ఆమెను చుట్టుముట్టి నిర్మానుష్యప్రాంతానికి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నగరపాలకసంస్థలోని ఓ విభాగంలో పనిచేస్తున్న మహిళా కంప్యూటర్‌ ఆపరేటర్‌ సీతారాంపూర్‌ ప్రాంతంలో ఎస్‌ఐఆర్‌ విధులు చేపడుతున్నారు. ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం ఆమె విధుల్లో ఉండగా, అక్కడికి మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లు వచ్చారు. 

ఆమెను చుట్టుముట్టి లైంగికవేధింపులకు దిగారు. ఒక దశలో నిర్మానుష్యప్రాంతానికి బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా అక్కడ జనాలు ఉండడంతో వీలుపడలేదు. ఆమెను దుర్భాషలాడుతూ తమతో రావాలని, తమకు కంపెనీ ఇవ్వాలంటూ వేధించారు. దీంతో తాను కమిషనర్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తే, ఉన్నతాధికారులు అని కూడా చూడకుండా వారు ఏమీ చేయలేరంటూ దుర్భాషలాడారు. గట్టిగా హెచ్చరించడంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా భర్త మరణంతో కారుణ్య ఉద్యోగం పొందిన ఆమెపై గత ఏడాదిన్నరగా వేధింపులు జరుగుతుండడం గమనార్హం. అప్పట్లోనే బాధిత మహిళ వేధింపులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాగా, సదరు కంప్యూటర్‌ ఆపరేటర్‌తో క్షమాపణ చెప్పించారు. 

విచారణకు ఆదేశం
తనను వేధిస్తున్న ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లపై చర్యతీసుకోవాలని ఈ నెల 13వ తేదీన బాధిత ఆపరేటర్‌ నగరపాలకసంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చే సింది. కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. బుధవా రం నగరపాలకసంస్థ అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణ చేపట్టింది. 

నిందితులు తమకు రాజకీయ పలుకుబడి ఉందంటూ, తమను ఎవరూ ఏం చేయలేరంటూ బాధిత మహిళను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఇలానే రాజకీయ పలుకుబడితోనే బయటపడ్డారని, మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విధుల్లో ఉన్న మహిళా కంప్యూటర్‌ ఆపరేటర్‌ను లైంగికంగా వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మహిళా ఉద్యోగులు కోరుతున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)