Breaking News

నమామి.. గోదావరి!

Published on Mon, 02/27/2023 - 02:24

బావరి.. బుద్ధుడిని బతికుండగా కలిసి, ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన భక్తుడు. ఆయన నివసించిన ప్రాంతం ప్రస్తుత నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలో గోదావరి రెండుగా చీలిన ప్రాంతంలో ఉన్న బాదన్‌కుర్తి గ్రామం అని అంచనా. ఆయన మరికొందరితో కలిసి ఇక్కడి నుంచే బౌద్ధంపై ప్రచారం ప్రారంభించారని చెప్తుంటారు. 

గోదావరి నదిపై ఆదిలాబాద్‌–నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలను అనుసంధానిస్తూ 1932లో నిర్మించిన రాతి వంతెన. నాడు ఆసియాలో ఈ తరహా తొలి వంతెన ఇదేనని చెప్తారు. 775 మీటర్ల పొడవైన ఈ వంతెన ప్రత్యేకతలకు మెచ్చి వెండితో దాని నమూనాను చేయించుకుని నిజాం తన నివాసంలో పెట్టుకున్నారు. పురానీ హవేలీలో అది ఇప్పటికీ ఉంది. ఈ వంతెన ఉన్న గ్రామం పేరు సోన్‌. అదో అగ్రహారం.. దాని వెనక చారిత్రక నేపథ్యమూ ఉంది. 

వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే విదేశీ పక్షులు గోదావరి నదిని ఆలంబనగా చేసుకుంటున్నాయి. గుడ్లు పెట్టి, పిల్లలను పొదిగేందుకు గోదావరి తీర ప్రాంతాలను ఎంచుకున్నాయి. 

..ఇలా గోదావరి నదీ తీరాన్ని తరిచి చూస్తే ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. స్థానికులకు తప్ప బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఆసక్తికర, ఆశ్చర్యకర విశేషాలూ మరెన్నో ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మూడు రాష్ట్రాల్లో 1,465 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తూ దక్షిణ గంగగా పేరొందిన గోదావరి నదీ తీరంపై అధ్యయనం చేసేందుకు భారీ ప్రణాళిక సిద్ధమవుతోంది. 
 – సాక్షి, హైదరాబాద్‌

నమామి గంగ స్ఫూర్తితో.. 
ప్రపంచంలోని పెద్ద నదుల్లో ఒకటి, భారతీయులకు పవిత్రమైనదీ అయిన గంగా నదిపై ‘ది ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ (ఇంటాక్‌)’నాలుగేళ్లపాటు విస్తృత అధ్యయనాన్ని నిర్వహించింది. గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నమామి గంగ’ప్రాజెక్టులో భాగంగా.. కాలుష్య కోరల నుంచి నదిని రక్షించడం, నదీ తీరంలో విలసిల్లుతున్న ప్రత్యేకతలను ప్రపంచం దృష్టికి తేవడం కోసం ఈ అధ్యయనానికి ఆదేశించింది.

ఇంటాక్‌ నిపుణులు బృందాలుగా విడిపోయి నదికి రెండు వైపులా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రత్యేకతలపై అధ్యయనం చేసి డాక్యుమెంటరీలు రూపొందించారు. అధ్యయనం ఆధారంగా నాలుగు పుస్తకాలను కూడా ప్రచురించారు. నది ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక, సహజ వారసత్వాలపై శోధించి ఎన్నో వివరాలు వెలుగులోకి తెచ్చారు.

గంగా నది మలుపులు తిరిగే ప్రాంతంలో ఏర్పడిన పాయలు ఏకంగా 20 కిలోమీటర్ల వెడల్పున ప్రవహిస్తూ ప్రత్యేక వెట్‌ల్యాండ్‌గా మారి.. జీవ వైవిధ్యాన్ని ఎలా పెంచుతున్నాయో ప్రత్యేక డాక్యుమెంటరీగా రూపొందించారు. గంగా తీరం అంటేనే ఆధ్యాత్మిక పరిమళం. మహా భారత, రామాయణాలతో ముడిపెట్టి స్థానికులు ప్రచారం చేసుకునే కొన్ని ప్రాంతాల్లో పురాతన నిర్మాణ జాడలను గుర్తించారు. ఇప్పుడు వాటిపై పరిశోధనలకు అవకాశం ఏర్పడింది. ఇక బుద్ధుడి కాలం నాటి ప్రత్యేకతలతోపాటు ఆది మానవుల నాటి నిర్మాణాలనూ గుర్తించారు. 


బాదన్‌కుర్తి గ్రామం ఉన్న గోదావరి చీలిక ప్రాంతం 

గోదావరిపైనా అధ్యయనం కోసం.. 
దేశంలో గంగా నది తర్వాత పెద్ద నదిగా ఉన్న గోదావరిపై కూడా ఇలాంటి అధ్యయనం చేస్తే బాగుంటుందని ఇంటాక్‌ సంస్థ భావించింది. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించగా.. అనుమతిస్తూ, అవసరమైన సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తర్వాత ఇంటాక్‌ ప్రతినిధులు ఇటీవల తెలంగాణ అధికారులను కలిసి చర్చించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కూడా నివేదించనున్నారు. 

త్వరలోనే అధ్యయనం  
తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ మా ప్రతిపాదనకు పూర్తి సానుకూలత వ్యక్తం చేశారు. మేం గోదావరి తీరంలో రెండు కిలోమీటర్ల బఫర్‌ ప్రాంతాన్ని పరిశీలిస్తామని కోరితే.. గంగా నది అధ్యయనం తరహాలో ఐదు కిలోమీటర్ల బఫర్‌ ప్రాంతంలో నిర్వహించాలని ఆయనే సూచించారు. త్వరలో ప్రణాళిక సిద్ధం చేసుకుని అధ్యయనం ప్రారంభిస్తాం 
–అనురాధారెడ్డి, ఇంటాక్‌ తెలంగాణ ప్రతినిధి 

గంగానది తరహాలో చేస్తాం 
కేంద్ర ప్రభుత్వ సూచ­న మేరకు మేం గంగా నది పరీవాహక ప్రాంతాల్లో నాలుగేళ్ల పాటు చేసిన విస్తృత అధ్యయనంతో ఎన్నో రహస్యాలను వెలుగులోకి తెచ్చాం. గంగా నది అంటే ఎన్ని వింతలో అని అబ్బురపడే వివరాలు వెలుగులోకి వచ్చాయి. అదే తరహాలో గోదావరి నది పరీవాహక ప్రాంతంలో కూడా సర్వే చేసేందుకు మేం ఆసక్తిగా ఉన్నాం. త్వరలో ప్రారంభిస్తాం. 
– సుమేశ్‌ దుదాని, సైంటిస్ట్‌ ఆఫీసర్, ఇంటాక్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)