Breaking News

మీసేవ కేంద్రాలపై ఫిర్యాదులు

Published on Thu, 01/22/2026 - 03:52

సాక్షి, యాదాద్రి: ధరణి, భూభారతి పోర్టళ్ల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్  అక్రమాల్లో మీసేవ కేంద్రాలు, ఇంటర్‌నెట్‌ కేంద్రాల నిర్వాహకుల పాత్రపై విచారణ జరుగుతోంది. యాదగిరిగుట్ట కేంద్రంగా జరిగిన ఈ అక్రమాల కేసులో పలువురు మీసేవ కేంద్రాల నిర్వాహకులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. యాదాద్రి జిల్లా వలిగొండ మీసేవ కేంద్రం నిర్వాహకుడిపై రెండు రోజుల క్రితం వర్కట్‌పల్లికి చెందిన సిర్పంగి స్వామి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 

వలిగొండలో మీసేవ నడుపుతున్న బలికే రాకేష్‌ భూభారతి అక్రమాల కేసులో పోలీస్‌ కేసు నమోదై అరెస్టు అయ్యారు. అయితే తహసీల్దార్‌ కార్యాలయంలోని అధికారులు సహకరించడం వల్లే మోసం జరిగిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇతర ప్రైవేట్‌ సిబ్బంది, మీసేవ కేంద్రాల నిర్వాహకుల మధ్య సహకారం కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మీసేవ, డాక్యుమెంట్‌ రైటర్లు, ఇంటర్‌నెట్‌ కేంద్రాల నిర్వాహకులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  

ఆపరేటర్లదే హవా!: రెవెన్యూ అధికారులు సైతం కంçప్యూటర్‌ ఆపరేటర్ల మీద ఆధారపడి.. ఫైళ్లు క్రాస్‌ చెక్‌ చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా నెట్‌ సెంటర్లకు ట్రేడ్‌ లైసెన్స్‌లు లేకపోవడం గమనార్హం. ఇలావుండగా సీసీఎల్‌ఏ లాగిన్‌లోకి ఎంటర్‌ అయి.. అక్రమాలకు పాల్పడిన 85 మందిపై పోలీస్‌ కేసులు నమోదు కాగా ఇందులో ఇద్దరు మీసేవ కేంద్రాల నిర్వాహకులు, 83 మంది సిటిజన్‌ లాగిన్‌ ద్వారా నెట్‌ సెంటర్‌ల నిర్వాహకులు లావాదేవీలు నడిపినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఒక్కో వ్యక్తి వందల కొద్దీ లావాదేవీలకు లాగిన్‌ అవుతున్నా పట్టించుకోలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)