Breaking News

నిబంధనలకు విరుద్ధంగా బదిలీల నుంచి కొందరి మినహాయింపు

Published on Wed, 07/31/2024 - 05:26

సాక్షి, హైదరాబాద్‌: సాధారణ బదిలీల నుంచి కొంతమంది డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా మినహాయింపు పొందారని ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాబూరావు మంగళవారం ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. డాక్టర్‌ పల్లం ప్రవీణ్, డాక్టర్‌ లాలూప్రసాద్‌ తదితరులు తెలంగాణ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌(టీజీజీడీఏ) ఆఫీస్‌ బేరర్లమని చెప్పుకుని బదిలీల నుంచి మినహాయింపు పొందారని, ప్రభుత్వం ఇచి్చన ఉత్తర్వుల ప్రకారం వీరు మినహాయింపులకు అర్హులు కారని బాబూరావు తెలిపారు.

పల్లం ప్రవీణ్‌ 19 ఏళ్లుగా, లాలూప్రసాద్‌ 12 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని, నిబంధనల ప్రకారం ఆరేళ్లకు పైబడి ఒకే జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాల్సి ఉన్నా.. అధికారులు వీరిని హైదరాబాద్‌ నుంచి కదపడం లేదని ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని ఆయన కోరారు. కాగా, ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌లో బదిలీలు చాలా అన్యాయంగా జరిగాయని పలువురు డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా కాకుండా ఆఫ్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు తీసుకొని ఇష్టారాజ్యంగా బదిలీలు చేశారని పలువురు అభ్యర్థులు మండిపడుతున్నారు. ఒక డాక్టర్‌ తన భర్త చనిపోయినట్లు విడో ఆప్షన్‌ కింద దరఖాస్తు చేస్తే, విడో సరి్టఫికెట్‌ చింపేసి ఆమెను బదిలీ చేయకుండా నిలిపివేశారు. దీంతో ఆమె ఆయుష్‌ అధికారులను నిలదీయగా అసలు ఆ సర్టిఫికెట్‌ పెట్టలేదని బుకాయిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. లక్షలాది రూపాయలు లంచంగా తీసుకొని ఇష్టమైన వారికి నచి్చన చోట బదిలీ చేపట్టారని చెబుతున్నారు. అలాగే రీజనల్‌ డైరెక్టర్‌ పోస్టును అర్హులకు కాకుండా ఇతరులకు ఇచి్చనట్లు ఒక డాక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)